![Team India world cup squad announced - Sakshi](/styles/webp/s3/article_images/2023/09/5/india.jpg.webp?itok=sRXNlDpW)
వన్డే ప్రపంచకప్-2023కు 15 మంది సభ్యులతో కూడిన భారత జట్టును బీసీసీఐ ప్రకటించింది. మంగళవారం క్యాండీ వేదికగా జరిగిన విలేకరుల సమావేశంలో బీసీసీఐ సెలక్షన్ కమిటీ చైర్మెన్ అజిత్ అగార్కర్ వెల్లడించాడు. ఈ ప్రెస్‌మీట్‌లో భారత కెప్టెన్ రోహిత్ శర్మ కూడా పాల్గొన్నాడు. అందరూ ఊహించినట్లగానే యువ ఆటగాళ్లు తిలక్ వర్మ, సంజూ శాంసన్‌కు వరల్డ్‌కప్ జట్టులో చోటు దక్కలేదు.
వీరిద్దరితో పాటు ఆసియాకప్ జట్టులో చోటు దక్కించుకున్న పేసర్ ప్రసిద్ద్ కృష్ణకు సెలక్టర్లు మొండిచేయి చూపించారు. ఇది మినహా జట్టులో అనూహ్య మార్పులు ఏమీ లేవు. కాగా రిజర్వ్ ఆటగాళ్ల జాబితాను మాత్రం ఛీప్ సెలక్టర్ అజిత్ అగార్కర్ వెల్లడించలేదు. ఈ జాబితాలో తిలక్, సంజూకు ఛాన్స్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.
ఆక్టోబర్ 8 న చెన్నై వేదికగా ఆస్ట్రేలియాతో జరగనున్న మ్యాచ్‌తో భారత్ తమ వరల్డ్‌కప్ ప్రయాణాన్ని ప్రారంభించనుంది. పుష్కరకాలం తర్వాత భారత్ వరల్డ్‌కప్‌కు అతిథ్యం ఇవ్వనున్న సంగతి తెలిసిందే. ఆక్టోబర్ 5న అహ్మదాబాద్ వేదికగా జరగనున్న ఇంగ్లండ్- న్యూజిలాండ్ మ్యాచ్‌తో ఈ మెగా ఈవెంట్ షురూ కానుంది. ఇప్పటికే ఈ టోర్నీ కోసం ఇంగ్లండ్, ఆస్ట్రేలియా వంటి టీమ్స్ కూడా తమ ప్రిలిమనరీ జట్లను ప్రకటించాయి.
ప్రపంచకప్‌కు భారత జట్టు: రోహిత్ శర్మ(కెప్టెన్), శుబ్‌మన్ గిల్, విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్, హార్దిక్ పాండ్యా(వైస్ కెప్టెన్), రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, జస్‌ప్రీత్ బుమ్రా, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్, కుల్దీప్ యాదవ్, శార్థూల్ ఠాకూర్.
🚨 NEWS 🚨
— BCCI (@BCCI) September 5, 2023
India’s squad for #CWC23 announced 🔽#TeamIndia
Comments
Please login to add a commentAdd a comment