స్వదేశంలో వచ్చే నెలలో జరిగే ప్రపంచకప్ వన్డే క్రికెట్ టోర్నీలో పాల్గొనే భారత జట్టును మంగళవారం మధ్యాహ్నం ప్రకటించనున్నారు. ఆసియా కప్ కోసం ఎంపిక చేసిన జట్టులో ఏమైనా మార్పులు చేసి ప్రపంచకప్‌లో ఇతర ఆటగాళ్లకు సెలక్టర్లు అవకాశం కల్పిస్తారో లేదో వేచి చూడాలి.
బెంగళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీలో నిర్వహించిన ఫిట్‌నెస్ పరీక్షలో భారత క్రికెటర్ కేఎల్ రాహుల్ పాస్ అయ్యాడు. దాంతో ఆసియా కప్‌లో మిగిలిన మ్యాచ్‌ల కోసం రాహుల్ మంగళవారం శ్రీలంకకు చేరుకోనున్నాడు.
సంజూకు నో ఛాన్స్..
ఇక ఈ మెగా టోర్నీ కోసం ఇప్పటికే 15 మంది సభ్యులతో కూడిన జట్టును అజిత్ అగర్కార్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ ఫైనల్ చేసినట్లు తెలుస్తోంది. ఈ జట్టులో తిలక్ వర్మ, సంజూ శాంసన్, ప్రసిద్ద్ కృష్ణకు చోటు దక్కపోయినట్లు సమాచారం. కాగా వీరి ముగ్గురు ఆసియాకప్ జట్టులో మాత్రం భాగమయ్యారు.
కానీ వన్డే ప్రపంచకప్‌కు మాత్రం సెలక్టర్లు మొగ్గుచూపకపోయినట్లు వార్తలు వినిపిస్తున్పాయి. అయితే సెలక్టర్లు ఓ అనుహ్య నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. శార్ధూల్ ఠాకూర్ స్ధానంలో లెఫ్ట్ ఆర్మ్ పేసర్ అర్ష్‌దీప్‌కు అవకాశం ఇచ్చినట్లు పలు రిపోర్టులు పేర్కొంటున్నాయి.
ప్రపంచకప్‌కు భారత జట్టు(అంచనా): రోహిత్ శర్మ(కెప్టెన్), శుబ్‌మన్ గిల్, విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్, హార్దిక్ పాండ్యా(వైస్ కెప్టెన్), రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, అర్ష్‌దీప్ సింగ్, జస్‌ప్రీత్ బుమ్రా, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్, కుల్దీప్ యాదవ్
చదవండి: Asia Cup 2023: చరిత్ర సృష్టించిన రోహిత్ శర్మ.. తొలి భారత ఆటగాడిగా! సచిన్ రికార్డు బద్దలు
Comments
Please login to add a commentAdd a comment