World Cup 2023 Schedule to be FIXED by Monday, India vs Pakistan on 15th October in Draft Schedule - Sakshi
Sakshi News home page

World Cup 2023: ఫ్యాన్స్‌కు బ్యాడ్‌ న్యూస్‌.. ఉప్పల్‌లో నో వరల్డ్‌కప్‌ మ్యాచ్‌! పాక్‌- భారత్‌ మ్యాచ్‌ అక్కడే

Published Mon, Jun 12 2023 9:47 AM | Last Updated on Mon, Jun 12 2023 10:27 AM

World Cup Schedule to be FIXED by Monday, India vs Pakistan on 15th October in Draft Schedule - Sakshi

వన్డే ప్రపంచకప్‌-2023కు భారత్‌ ఆతిథ్యం ఇవ్వనున్న సంగతి తెలిసిందే. ఈ ఏడాది ఆక్టోబర్‌లో ఈ మెగా టోర్నీ షురూ కానుంది. కాగా ఈ వన్డే ప్రపంచకప్‌కు సంబంధించిన షెడ్యూల్‌ను ఐసీసీ సోమవారం ఖారారు చేయనున్నట్లు తెలుస్తోంది. ఇక ఇప్పటికే ఈ మెగా ఈవెంట్‌కు సంబంధించిన డ్రాప్ట్‌ షెడ్యూల్‌ను బీసీసీఐ ఐసీసీకు పంపినట్లు ప్రముఖ స్పోర్ట్స్‌ వెబ్‌సైట్‌ ఈఎస్‌ప్పీన్‌ వెల్లడించింది.

ఈఎస్‌ప్పీన్‌ రిపోర్ట్‌ ప్రకారం.. టీమిండియా తమ గ్రూప్‌ స్టేజ్‌ మ్యాచ్‌లు ఆడేందుకు 8 వేదికలను బీసీసీఐ ఖారారు చేసినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా క్రికెట్‌ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న పాకిస్తాన్‌-భారత్‌ మ్యాచ్‌ చెన్నై వేదికగా ఆక్టోబర్‌ 15న  జరగనున్నట్లు తెలుస్తోంది.

తొలుత అహ్మదాబాద్‌ వేదికగా ఈ హైవోల్డేజ్‌ మ్యాచ్‌ నిర్వహించాలని బీసీసీఐ భావించినా.. భద్రతకారణాల దృష్ట్యా ఆఖరి నిమిషంలో తమ నిర్ణయాన్ని మార్చుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అదే విధంగా పాకిస్తాన్‌ క్రికెట్‌ బోర్డు కూడా తమ జట్టు అహ్మదాబాద్‌లో ఆడేందుకు సముఖత చూపలేదని పలు నివేదికలు పేర్కొంటున్నాయి. చెన్నై, ఢిల్లీ, పుణే, ధర్మశాల, లక్నో, ముంబై, కోల్‌కతా, బెంగళూరు వేదికగా టీమిండియా మ్యాచ్‌లు జరిగే అవకాశం ఉంది.

హైదరాబాద్‌లో నో మ్యాచ్‌!
తెలుగు రాష్ట్రాల క్రికెట్‌ అభిమానులకు బ్యాడ్‌ న్యూస్‌. వన్డే ప్రపంచ కప్‌కు బీసీసీఐ షార్ట్‌ లిస్టు చేసిన వేదికల జాబితాలో హైదరాబాద్‌లోని ఉప్పల్‌ స్టేడియం ఒక్కటి. అయితే ఉప్పల్‌లో మాత్రం భారత జట్టు ఆడే సూచనలు కన్పించడం లేదు. టీమిండియా మ్యాచ్‌లకు సంబంధించి బీసీసీఐ సిద్దం చేసిన డ్రాప్ట్‌ షెడ్యూల్‌లో హైదరాబాద్‌ పేరు లేనట్లు తెలుస్తోంది. వేరే జట్లకు సంబంధించిన లీగ్‌ మ్యాచ్‌లు ఈ స్టేడియంలో జరిగే ఛాన్స్‌ ఉంది.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement