చెస్ ఒలింపియాడ్‌లో వరుసగా మూడో విజయం
బుడాపెస్ట్ (హంగేరి): చెస్ ఒలింపియాడ్‌లో భారత పురుషుల, మహిళల జట్లు వరుసగా మూడో విజయం నమోదు చేశాయి. శుక్రవారం జరిగిన మూడో రౌండ్ మ్యాచ్‌ల్లో భారత మహిళల జట్టు 3–1తో స్విట్జర్లాండ్ జట్టును ఓడించగా... భారత పురుషుల జట్టు 3.5–0.5తో హంగేరి ‘బి’ జట్టుపై గెలిచింది.
స్విట్జర్లాండ్‌తో జరిగిన గేముల్లో భారత స్టార్ ద్రోణవల్లి హారిక 46 ఎత్తుల్లో ప్రపంచ మాజీ చాంపియన్ అలెగ్జాండ్రా కొస్టెనిక్ చేతిలో ఓడిపోగా... వైశాలి 38 ఎత్తుల్లో ఘజల్ హాకిమ్‌ఫర్డ్‌పై, దివ్య దేశ్‌ముఖ్ 32 ఎత్తుల్లో సోఫియా హ్రిజ్లోవాపై, వంతిక అగర్వాల్ 48 ఎత్తుల్లో మరియా మాంకోపై విజయం సాధించారు. తానియా సచ్‌దేవ్‌కు ఈ మ్యాచ్‌లో విశ్రాంతి ఇచ్చారు.
హంగేరి ‘బి’ జట్టుతో జరిగిన గేముల్లో భారత నంబర్‌వన్, ప్రపంచ నాలుగో ర్యాంకర్ ఇరిగేశి అర్జున్ 34 ఎత్తుల్లో పీటర్ ప్రొజాస్కాపై, దొమ్మరాజు గుకేశ్ 54 ఎత్తుల్లో ఆడమ్ కొజాక్‌పై, ప్రజ్ఞానంద 63 ఎత్తుల్లో తామస్ బానుస్‌పై గెలిచారు. గాబోర్ పాప్‌తో జరిగిన గేమ్‌ను విదిత్ సంతోష్ గుజరాతి 26 ఎత్తుల్లో ‘డ్రా’ చేసుకున్నాడు. పెంటేల హరికృష్ణకు ఈ మ్యాచ్‌లో విశ్రాంతి ఇచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment