Third victory
-
భారత జట్ల ‘హ్యాట్రిక్’
బుడాపెస్ట్ (హంగేరి): చెస్ ఒలింపియాడ్‌లో భారత పురుషుల, మహిళల జట్లు వరుసగా మూడో విజయం నమోదు చేశాయి. శుక్రవారం జరిగిన మూడో రౌండ్ మ్యాచ్‌ల్లో భారత మహిళల జట్టు 3–1తో స్విట్జర్లాండ్ జట్టును ఓడించగా... భారత పురుషుల జట్టు 3.5–0.5తో హంగేరి ‘బి’ జట్టుపై గెలిచింది. స్విట్జర్లాండ్‌తో జరిగిన గేముల్లో భారత స్టార్ ద్రోణవల్లి హారిక 46 ఎత్తుల్లో ప్రపంచ మాజీ చాంపియన్ అలెగ్జాండ్రా కొస్టెనిక్ చేతిలో ఓడిపోగా... వైశాలి 38 ఎత్తుల్లో ఘజల్ హాకిమ్‌ఫర్డ్‌పై, దివ్య దేశ్‌ముఖ్ 32 ఎత్తుల్లో సోఫియా హ్రిజ్లోవాపై, వంతిక అగర్వాల్ 48 ఎత్తుల్లో మరియా మాంకోపై విజయం సాధించారు. తానియా సచ్‌దేవ్‌కు ఈ మ్యాచ్‌లో విశ్రాంతి ఇచ్చారు.హంగేరి ‘బి’ జట్టుతో జరిగిన గేముల్లో భారత నంబర్‌వన్, ప్రపంచ నాలుగో ర్యాంకర్ ఇరిగేశి అర్జున్ 34 ఎత్తుల్లో పీటర్ ప్రొజాస్కాపై, దొమ్మరాజు గుకేశ్ 54 ఎత్తుల్లో ఆడమ్ కొజాక్‌పై, ప్రజ్ఞానంద 63 ఎత్తుల్లో తామస్ బానుస్‌పై గెలిచారు. గాబోర్ పాప్‌తో జరిగిన గేమ్‌ను విదిత్ సంతోష్ గుజరాతి 26 ఎత్తుల్లో ‘డ్రా’ చేసుకున్నాడు. పెంటేల హరికృష్ణకు ఈ మ్యాచ్‌లో విశ్రాంతి ఇచ్చారు. -
పోర్చుగల్‌లో సోషలిస్టుల గెలుపు
లిస్బన్: పోర్చుగల్‌లోని లెఫ్టిస్టు ఆలోచనాధోరణితో కూడిన సోషలిస్ట్ పార్టీ సార్వత్రిక ఎన్నికల్లో వరుసగా మూడోమారు విజయం సాధించింది. కోవిడ్‌తో కునారిల్లిన పోర్చుగల్ ఆర్థిక వ్యవస్థను ఆదుకునేందుకు యూరోపియన్ యూనియన్ వందల కోట్ల యూరోల సాయాన్ని అందించేందుకు సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో సోషలిస్టుపార్టీ మరోమారు విజయదుందుభి మోగించింది. కరోనా వైరస్ కేసుల పెరుగుదల సమయంలో జరిగిన ఈ ఎన్నికలలో 230 సీట్ల పార్లమెంటులో సోషలిస్టులు 106 సీట్లు గెలుచుకున్నారు. ఆదివారానికి ఎన్నికల్లో 98.5 శాతం ఓట్లను లెక్కించగా ఇందులో సోషలిస్టులు 41 శాతం ఓట్లను పొందారు. సోషలిస్టుల ప్రధాన ప్రత్యర్థి సెంటర్–రైట్ సోషల్ డెమోక్రటిక్ పార్టీకి 28 శాతం ఓట్లు వచ్చాయి. ఈ పార్టీ 65 పార్లమెంటరీ స్థానాలను గెలుచుకుంది. దేశంలోని 1.08 కోట్ల అర్హులైన ఓటర్లలో ఈ దఫా విదేశాల్లో నివసిస్తూ మెయిల్ ద్వారా ఓటు వేసే 15 లక్షల మంది ఓట్లను పరిగణనలోకి తీసుకోలేదు. మరోదఫా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్న ప్రధాని ఆంటినో కోస్టాకు భారత ప్రధాని మోదీ శుభాకాంక్షలు తెలిపారు. పోర్చుగల్‌తో బలమైన బంధాన్ని కోరుకుంటున్నామన్నారు. 116 సీట్ల మెజార్టీ.. పార్లమెంట్లో మెజార్టీకి అవసరమైన 116 సీట్లను సోషలిస్టులు గెలుచుకుంటారా? లేక చిన్న పార్టీల మద్దతు అవసరంపడుతుందా అనే విషయమై ఇంకా పూర్తి స్పష్టత రాలేదు. పోర్చుగీస్ టెలివిజన్ చానెళ్ల ప్రత్యేక ఎగ్జిట్ పోల్స్ మాత్రం సోషలిస్టులకు పూర్తి మెజార్టీ రావచ్చని అంచనా వేశాయి. పోర్చుగల్‌లో కొత్త ప్రభుత్వంపై అంచనాలు అధికంగా ఉన్నాయి. పశ్చిమ యూరప్‌లో పేదదైన ఈ దేశానికి ఈయూ 5000 కోట్ల డాలర్ల సాయం అందించనుంది. ఈ మొత్తంలో మూడింట రెండు వంతులు ప్రధాన మౌలిక సదుపాయాలు కోసం ఉద్దేశించారు. మిగిలిన మొత్తాన్ని ప్రైవేట్ కంపెనీలకు అందిస్తారు. పార్లమెంట్లో పూర్తి మెజార్టీ ఉన్న ప్రభుత్వం ఏర్పడితే ఈ నిధుల కేటాయింపు, వ్యయం సజావుగా సాగుతాయని నిపుణులు భావిస్తున్నారు. 2022 కోసం అప్పటి మైనారిటీ సోషలిస్ట్ ప్రభుత్వం రూపొందించిన వ్యయ ప్రణాళికను పార్లమెంటు గత నవంబర్‌లో తిరస్కరించింది. దీంతో నూతన వ్యయప్రణాళిక అమలుకు స్థిర ప్రభుత్వ అవసరం ఉంది. 2015లో అధికారంలోకి వచ్చినప్పటి నుండి, వార్షిక బడ్జెట్‌ను ఆమోదానికి ప్రతిసారీ మిత్రపక్షాలైన లెఫ్ట్ బ్లాక్, పోర్చుగీస్ కమ్యూనిస్ట్ పార్టీల మద్దతుపై సోషలిస్టు పార్టీ ఆధారపడుతోంది. కానీ రెండు నెలల క్రితం ఈపార్టీల మధ్య విభేదాలు ముదిరాయి. దీంతో పార్లమెంట్లో సోషలిస్ట్ ప్రధాన మంత్రి ఆంటినో కోస్టాకు మెజార్టీ మద్దతు గగనమైంది. ఈ ఎన్నికల్లో మెజార్టీ సోషలిస్టులకు తగినంత బలాన్ని ఇవ్వనుంది. చేగా.. గెలుపు పోర్చుగల్‌లో వరుసగా రెండుమార్లు సోషలిస్టు పార్టీనే అధికారంలో ఉంది. దీని ప్రధాన ప్రత్యర్థి సోషల్ డెమొక్రాటిక్ పార్టీ. ఈ రెండు పార్టీలే దేశంలో దశాబ్దాలుగా అధికారం అనుభవిస్తున్నాయి. కానీ ఈసారి చేగా అనే పార్టీ సత్తా చూపింది. మూడు సంవత్సరాల క్రితం దేశంలో ఆవిర్భవించిన ప్రజాకర్షక మరియు జాతీయవాద పార్టీ చేగా (చాలు అని అర్థం) ఈ ఎన్నికల్లో 5– 8 శాతం ఓట్లను కొల్లగొట్టినట్లు ఆర్టీపీ పోల్స్ అంచనా వేసింది. దీంతో ఈ పార్టీకి పార్లమెంట్లో 13 సీట్లు దక్కవచ్చని అంచనా. గత ఎన్నికల్లో ఈ పార్టీ కేవలం ఒక్క సీటుకే పరిమితమైంది. పోర్చుగీస్ కమ్యూనిస్ట్ పార్టీకి 3– 5 శాతం ఓట్లు లభించాయి. ఈ ఎన్నికల్లో 46– 51 శాతం మధ్య పోలింగ్ నమోదైంది. 2019 ఎన్నికల్లో 48.6 శాతం పోలింగ్ నమోదైంది. కరోనా కారణంగా అర్హులైన ఓటర్లలో దాదాపు 10 లక్షలమంది ఇంకా ఐసోలేషన్‌లోనే ఉన్నారు. దేశాధ్యక్షుడు మార్సెలో రెబోలో డీసౌజా సైతం ఓటు వేయమని ప్రజలకు పిలుపునిచ్చారు. -
హంపికి మూడో విజయం
చెంగ్డూ: ఫిడే ఉమెన్స్ గ్రాండ్‌ప్రి చెస్ చాంపియన్‌షిప్‌లో భారత గ్రాండ్మాస్టన్ కోనేరు హంపి వరుసగా మూడు విజయాలతో అగ్రస్థానానికి చేరింది. మంగళవారం జరిగిన నాలుగో రౌండ్లో తను టాన్ జోంగ్యి (చైనా)పై నెగ్గింది. మరోవైపు ద్రోణవల్లి హారిక 31 ఎత్తుల్లో ప్రపంచ ఆరో ర్యాంక్ క్రీడాకారిణి మరియా ముజిచుక్ (ఉక్రెయిన్)తో గేమ్‌ను డ్రాగా ముగించింది. -
తెలుగు టైటాన్స్ కు మూడో గెలుపు
బెంగళూరు: ప్రొ కబడ్డీ లీగ్ టోర్నమెంట్లో తెలుగు టైటాన్స్ జట్టుకు మూడో విజయం లభించింది. బెంగళూరు బుల్స్‌తో శనివారం జరిగిన మ్యాచ్‌లో తెలుగు టైటాన్స్ జట్టు 35-26 పాయింట్ల తేడాతో గెలిచింది. కెప్టెన్ రాహుల్ చౌదరి అద్భుత ఆటతీరును కనబరిచి 11 పాయింట్లు సాధించి తెలుగు టైటాన్స్ విజయంలో కీలకపాత్ర పోషించాడు. మిగతా ఆటగాళ్లు సుకేశ్ హేగ్డె నాలుగు, ధర్మరాజ్ చెరలథన్, వికాస్ కాలే మూడేసి పాయింట్లు సంపాదించగా... మేరాజ్ షేక్, రాహుల్ కుమార్ రెండేసి పాయింట్లు స్కోరు చేసి టైటాన్స్ విజయంలో తమ వంతు పాత్ర పోషించారు. విరామ సమయానికి 18-9తో ఆధిక్యంలో నిలిచిన టైటాన్స్ జట్టు రెండో అర్ధభాగంలోనూ తమ ఆధిపత్యాన్ని చాటుకుంది. మరో మ్యాచ్‌లో పట్నా పైరేట్స్ 40-26తో డిఫెండింగ్ చాంపియన్ యు ముంబాపై సంచలన విజయం సాధించింది. -
హరికృష్ణకు మరో గెలుపు
న్యూఢిల్లీ: జిబ్రాల్టర్ చెస్ ఫెస్టివల్ అంతర్జాతీయ టోర్నమెంట్లో ఆంధ్రప్రదేశ్ గ్రాండ్‌మాస్టర్ పెంటేల హరికృష్ణ మూడో విజయాన్ని సాధించాడు. నాలుగో రౌండ్లో అరవింద్ చిదంబరం (భారత్)తో జరిగిన గేమ్‌లో తెల్లపావులతో ఆడిన హరికృష్ణ 115 ఎత్తుల్లో గెలుపొందాడు. ఆంధ్రప్రదేశ్‌కే చెందిన మరో గ్రాండ్‌మాస్టర్ ద్రోణవల్లి హారిక తొలి ‘డ్రా’ నమోదు చేసింది. రిచర్డ్ రాపోర్ట్ (హంగేరి)తో జరిగిన గేమ్‌ను హారిక 37 ఎత్తుల్లో ‘డ్రా’ చేసుకుంది. గ్రిగోరి ఒపారిన్ (రష్యా)తో జరిగిన గేమ్‌ను విశ్వనాథన్ ఆనంద్ 31 ఎత్తుల్లో ‘డ్రా’గా ముగించాడు. జోల్టాన్ అల్మాసీ (హంగేరి)తో జరిగిన గేమ్‌లో లలిత్ బాబు 47 ఎత్తుల్లో ఓడిపోగా... దిమిత్రిజ్ కొలార్స్ (జర్మనీ)తో జరిగిన గేమ్‌ను ప్రత్యూష ‘డ్రా’ చేసుకుంది. -
దుమ్మురేపిన హామిల్టన్
బహ్రెయిన్ గ్రాండ్‌ప్రి టైటిల్ సొంతం సీజన్లో మూడో విజయం మనామా (బహ్రెయిన్): క్వాలిఫయింగ్‌లోనే కాదు ప్రధాన రేసులోనూ తన సత్తా చాటుకున్న మెర్సిడెస్ జట్టు డ్రైవర్ లూయిస్ హామిల్టన్ ఫార్ములావన్ సీజన్లో మూడో విజయాన్ని సొంతం చేసుకున్నాడు. ఆదివారం జరిగిన బహ్రెయిన్ గ్రాండ్‌ప్రి రేసులో డిఫెండింగ్ చాంపియన్ హామిల్టన్ విజేతగా నిలిచాడు. 57 ల్యాప్‌ల ఈ రేసును హామిల్టన్ గంటా 35 నిమిషాల 05.809 సెకన్లలో పూర్తి చేసి అగ్రస్థానాన్ని సంపాదించాడు. తద్వారా బహ్రెయిన్ గ్రాండ్‌ప్రి రేసులో వరుసగా రెండేళ్లు విజేతగా నిలిచిన నాలుగో డ్రైవర్‌గా గుర్తింపు పొందాడు. గతంలో అలోన్సో (2005, 06); మసా (2007, 08), వెటెల్ (2012, 13) ఈ ఘనత సాధించారు. ‘పోల్ పొజిషన్’తో రేసును ఆరంభించిన ఈ బ్రిటన్ డ్రైవర్‌కు చివరి దశలో మాత్రమే ఫెరారీ డ్రైవర్ కిమీ రైకోనెన్ నుంచి పోటీ ఎదురైంది. దాంతోపాటు తన కారులో చిన్నపాటి సమస్య వచ్చినా హామిల్టన్ నియంత్రణ కోల్పోకుండా డ్రైవ్ చేసి గమ్యానికి చేరుకున్నాడు. ఈ సీజన్లో ఆస్ట్రేలియా, చైనా గ్రాండ్‌ప్రిలలో కూడా హామిల్టన్ విజేతగా నిలిచాడు. మరో ల్యాప్ మిగిలి ఉండగా హామిల్టన్ సహచరుడు నికో రోస్బర్గ్ను ఓవర్టేక్ చేసిన రైకోనెన్ చివరకు రెండో స్థానాన్ని దక్కించుకున్నాడు. రోస్బర్గ్కు మూడో స్థానం, బొటాస్ (విలియమ్స్) నాలుగో స్థానం, వెటెల్ (ఫెరారీ) ఐదో స్థానం సంపాదించారు. భారత్‌కు చెందిన ఫోర్స్ ఇండియా డ్రైవర్లలో పెరెజ్ ఎనిమిదో స్థానంలో నిలువగా... హుల్కెన్‌బర్గ్ 13వ స్థానంతో సరిపెట్టుకున్నాడు. సీజన్‌లోని తదుపరి రేసు స్పెయిన్ గ్రాండ్‌ప్రి మే 10వ తేదీన జరుగుతుంది. డ్రైవర్స్ చాంపియన్‌షిప్ రేసులో ప్రస్తుతం హామిల్టన్ (93 పాయింట్లు), రోస్‌బర్గ్ (66), వెటెల్ (65) వరుసగా తొలి మూడు స్థానాల్లో ఉన్నారు.