న్యూఢిల్లీ: జిబ్రాల్టర్ చెస్ ఫెస్టివల్ అంతర్జాతీయ టోర్నమెంట్లో ఆంధ్రప్రదేశ్ గ్రాండ్‌మాస్టర్ పెంటేల హరికృష్ణ మూడో విజయాన్ని సాధించాడు. నాలుగో రౌండ్లో అరవింద్ చిదంబరం (భారత్)తో జరిగిన గేమ్‌లో తెల్లపావులతో ఆడిన హరికృష్ణ 115 ఎత్తుల్లో గెలుపొందాడు. ఆంధ్రప్రదేశ్‌కే చెందిన మరో గ్రాండ్‌మాస్టర్ ద్రోణవల్లి హారిక తొలి ‘డ్రా’ నమోదు చేసింది.
రిచర్డ్ రాపోర్ట్ (హంగేరి)తో జరిగిన గేమ్‌ను హారిక 37 ఎత్తుల్లో ‘డ్రా’ చేసుకుంది. గ్రిగోరి ఒపారిన్ (రష్యా)తో జరిగిన గేమ్‌ను విశ్వనాథన్ ఆనంద్ 31 ఎత్తుల్లో ‘డ్రా’గా ముగించాడు. జోల్టాన్ అల్మాసీ (హంగేరి)తో జరిగిన గేమ్‌లో లలిత్ బాబు 47 ఎత్తుల్లో ఓడిపోగా... దిమిత్రిజ్ కొలార్స్ (జర్మనీ)తో జరిగిన గేమ్‌ను ప్రత్యూష ‘డ్రా’ చేసుకుంది.