సోషల్ మీడియా ప్రభావం పెరిగిన తర్వాత సెలబ్రిటీలు.. వారి అభిమానులకు మరింత చేరువయ్యే అవకాశం లభించింది. ట్విటర్, ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్ వంటి ప్రధాన సామాజిక మాధ్యమాల్లో ఎప్పటికప్పుడు తమకు సంబంధించిన అప్‌డేట్లు పంచుకోవడం సులువైంది. తద్వారా ఫ్యాన్స్‌ను అలరించడంతో పాటు అదనపు ఆదాయాన్ని ఆర్జించే మార్గం కూడా దొరికింది. యాడ్స్, ప్రమోషన్స్‌తో చేతినిండా సంపాదిస్తున్నారు.
రోజురోజుకూ ఫాలోవర్లను పెంచుకుంటూ.. ఒక్కో పోస్టుకు కోట్లాది రూపాయాలు వసూలు చేసే ప్రముఖులు చాలా మందే ఉన్నారు. ముఖ్యంగా ఫొటో, వీడియో బ్లాగింగ్ ప్లాట్‌ఫామ్ ఇన్‌స్టాగ్రామ్ వారిపై కాసుల వర్షం కురిపిస్తోంది. మరి క్రీడా విభాగానికి సంబంధించి ఇన్‌స్టా పోస్టులతో అత్యధికంగా సంపాదించిన, గతేడాది టాప్-20లో ఉన్న సెలబ్రిటీల్లో టీమిండియా టెస్టు కెప్టెన్ విరాట్ కోహ్లి ఒక్కడికే చోటు దక్కింది. కోహ్లి ఒక్కో పోస్టుకు సుమారు 680,000 డాలర్లు(మన కరెన్సీలో దాదాపు 5.08 కోట్లు) అందుకుంటున్నాడు.
మరి వామిక ఫొటోకు...
ఇక ఇప్పటి వరకు తన ఆట, యాడ్స్.. ప్రమోషన్లు... భార్య, బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క శర్మతో ఉన్న ఫొటోలు షేర్ చేసిన కోహ్లి... తన గారాల పట్టి వామిక ఫొటోను మాత్రం రివీల్ చేయలేదు. జనవరి 11 వామిక తొలి పుట్టిన రోజు నేపథ్యంలో ఇప్పటికైనా చిన్నారి రూపాన్ని తమకు చూపిస్తాడని ఫ్యాన్స్ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. కోహ్లి గారాల పట్టి వామిక ఫొటోలకు కోట్లలో లైకులు రావడం ఖాయమని, ఫాలోవర్లు కూడా భారీగా పెరుగుతారంటూ కామెంట్లు చేస్తున్నారు.
కాగా కోహ్లికి ఇన్‌స్టాగ్రామ్‌లో ఇప్పటివరకు 177 మిలియన్ల మంది ఫాలోవర్లు ఉన్నారు. ఇక చివరిసారిగా తన తల్లి పుట్టినరోజు సందర్భంగా ఆమెతో కలిసి ఉన్న ఫొటోను షేర్ చేశాడు కోహ్లి. ప్రస్తుతం అతడు దక్షిణాఫ్రికా టూర్‌లో ఉన్నాడు. గాయం కారణంగా రెండో టెస్టుకు దూరమైన కోహ్లి.. మూడో మ్యాచ్‌కు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. ఇక ఒక్కో ఇన్‌స్టా పోస్టుతో ఫుట్‌బాల్ దిగ్గజం క్రిస్టియానో రోనాల్డో 1,604,000 అమెరికన్ డాలర్లు సంపాదిస్తూ ప్రపంచంలోనే నెంబర్ వన్‌గా ఉన్నాడు. అతడికి 387 మిలియన్ల ఫాలోవర్లు ఉన్నారు. ఇక ఫాలోవర్ల ఆధారంగా సెలబ్రిటీలు చేసే పోస్టుకు లభించే ఆదాయంలో వ్యత్యాసాలు ఉంటాయన్న సంగతి తెలిసిందే.
చదవండి: Ashes: రెండేళ్ల తర్వాత రీ ఎంట్రీ.. వరుస సెంచరీలు.. యాషెస్‌లో అన్‌స్టాపబుల్ ఖవాజా!
Comments
Please login to add a commentAdd a comment