టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లి తన వందో అంతర్జాతీయ టీ20 మ్యాచ్ ఆడటానికి సిద్ధమవుతున్నాడు. ఆసియాకప్-2022లో భాగంగా పాకిస్తాన్‌తో జరగబోయే మ్యాచ్‌తో తన సెంచరీ మ్యాచ్ మార్క్‌ను కోహ్లి అందుకోనున్నాడు. అయితే ఈ మ్యాచ్‌కు ముందు కింగ్ కోహ్లి కీలక నిర్ణయం తీసుకున్నాడు. తను రెగ్యూలర్‌గా ఆడుతున్న ఎంఆర్‌ఫ్ జీనియస్ బ్యాట్‌కు కోహ్లి స్వస్తి పలికాడు.
ఇకపై కోహ్లి ఎంఆర్‌ఫ్ గోల్డ్ విజార్డ్ బ్యాట్‌తో ఆడనున్నాడు. కాగా కోహ్లి గత కొంత కాలంగా గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్నాడు. అతడు అంతర్జాతీయ క్రికెట్‌లో సెంచరీ సాధించి మూడేళ్లు దాటుతోంది. అయితే గత కొన్ని రోజులుగా విశ్రాంతి తీసుకున్న కోహ్లి తిరిగి ఆసియాకప్‌లో అడుగుపెట్టున్నాడు. ఈ మెగా టోర్నీలో తిరిగి తన ఫామ్‌ను పొందాలని కింగ్ కోహ్లి భావిస్తున్నాడు.
కోహ్లి కొత్త బ్యాట్ విషయానికి వస్తే.. ఎంఆర్‌ఫ్ గోల్డ్ విజార్డ్ 1.15 కిలోగ్రాముల బరువు కలిగి ఉంది. కోహ్లి కొత్త బ్యాట్‌కు సంబంధించిన వీడియోను స్పోర్ట్స్ లాంచ్‌ప్యాడ్ అనే వెబ్‌సైట్ తమ సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేసింది. కాగా ఆసియాకప్-2022 యూఏఈ వేదికగా ఆక్టోబర్ 27 నుంచి ప్రారంభం కానుంది. ఈ టోర్నీలో భాగంగా భారత్ తమ తొలి మ్యాచ్‌లో ఆగస్టు 28న చిరకాల ప్రత్యర్ధి పాకిస్తాన్‌తో తలపడనుంది.
ఆసియాకప్‌కు భారత జట్టు
రోహిత్ శర్మ(కెప్టెన్), కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లి, సూర్యకుమార్ యాదవ్, రిషభ్ పంత్, దీపక్ హుడా, దినేశ్ కార్తిక్, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, యజువేంద్ర చహల్, రవి బిష్ణోయి, భువనేశ్వర్‌కుమార్, అర్ష్‌దీప్ సింగ్, ఆవేశ్ ఖాన్
స్టాండ్‌బై ప్లేయర్లు: శ్రేయస్ అయ్యర్, అక్షర్ పటేల్, దీపక్ చహర్
చదవండి: Asia Cup 2022: ఆసియా కప్ టోర్నీలో పాల్గొనబోయే టీమ్‌లు.. అన్ని జట్ల ఆటగాళ్ల వివరాలు
Comments
Please login to add a commentAdd a comment