వెస్టిండీస్‌తో టెస్టు సిరీస్‌కు ముందు టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి నెట్స్‌లో తీవ్రంగా శ్రమిస్తున్నాడు. తన సహచర ఆటగాళ్లతో కలసి నెట్ ప్రాక్టీస్‌లో బీజీ బీజీగా గడుపుతున్నాడు. రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, జయదేవ్ ఉనద్కట్ వంటి అనుభవజ్ఞులైన బౌలింగ్‌లో విరాట్ బ్యాటింగ్ ప్రాక్టీస్ చేస్తున్నాడు.
ముఖ్యంగా వెటరన్ ఆఫ్ స్పిన్నర్ అశ్విన్ బౌలింగ్‌లో రివర్స్ స్వీప్ షాట్లను కోహ్లి ప్రాక్టీస్ చేశాడు. కాగా అంతర్జాతీయ క్రికెట్‌లో కోహ్లి సాధారణంగా ఎప్పుడూ రివర్స్ స్వీప్ షాట్లకు ప్రయత్నించడన్న సంగతి తెలిసిందే. అయితే నెట్స్‌లో మాత్రం అశ్విన్ బౌలింగ్‌లో విరాట్ ఆడిన రివర్స్ స్వీప్ షాట్‌కు రవీంద్ర జడేజా ఫిదా అయిపోయాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ మారింది.
బ్యాటింగ్ కోచ్‌గా మారిన కింగ్..
నెట్స్‌లో జైశ్వాల్ చాలా సమయం కోహ్లితో గడిపాడు. అతడు నుంచి చాలా విషయాలు నేర్చుకున్నాడు. కాగా తొలిసారిగా భారత టెస్టు జట్టులో జైశ్వాల్ చోటు దక్కింది.
దేశీవాళీ క్రికెట్‌తో పాటు ఐపీఎల్‌లో అద్బుతంగా రాణించడంతో సెలక్టర్లు ఈ యువ ఆటగాడికి పిలుపునిచ్చారు. డొమినికా వేదికగా జూలై 12 నుంచి ఈ రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ ప్రారంభం కానుంది. ఈ సిరీస్‌తో జైశ్వాల్ టెస్టుల్లో అంతర్జాతీయ అరంగేట్రం చేసే ఛాన్స్ ఉంది.
చదవండి: ధోని అస్సలు కెప్టెన్ కూల్ కాదు.. బూతులు తిట్టేవాడు: టీమిండియా ప్లేయర్
Watch 🎥
— OneCricket (@OneCricketApp) July 5, 2023
Virat Kohli batting in the nets ahead of the Test series against West Indies! #ViratKohli #INDvsWI #TeamIndia pic.twitter.com/GdnRvINBWK
Comments
Please login to add a commentAdd a comment