T20 World Cup 2022- India Vs Netherlands: నెదర్లాండ్స్‌తో గురువారం జరిగే మ్యాచ్ కోసం సిడ్నీ చేరుకున్న భారత జట్టు సన్నాహకాల్లో మునిగింది. మంగళవారం ప్రాక్టీస్ సెషన్‌పై ముఖ్యంగా అందరి దృష్టీ ఓపెనర్ రాహుల్‌పైనే నిలిచింది. పాక్‌తో మ్యాచ్‌లో విఫలమైన అతను ఈ సారి తనదైన ముద్ర వేయాలని పట్టుదలగా ఉన్నాడు. గత కొంతకాలంగా చూస్తే ఆఫ్‌స్టంప్ ఆవల పడిన బంతిని ఆడే ప్రయత్నంలో రాహుల్ బంతిని స్టంప్స్ పైకి ఆడుకొని తరచుగా అవుటవుతున్నాడు.
లోపాన్ని సరిదిద్దుకునేలా
ఈ లోపాన్ని సరిదిద్దుకోవడంపైనే అతను దృష్టి పెట్టాడు. హెడ్ కోచ్ ద్రవిడ్ నేతృత్వంలోని కోచింగ్ బృందం కూడా దీనిని సరిదిద్దే ప్రయత్నం చేసింది. నెట్స్‌లో బౌలింగ్ చేసిన శార్దుల్ ఠాకూర్, సిరాజ్ పదే పదే ‘ఫోర్త్ స్టంప్’పైనే బంతులు వేసి రాహుల్‌కు కావాల్సిన ప్రాక్టీస్‌ను ఇచ్చారు. కాగా పాకిస్తాన్‌తో ఆదివారం నాటి మ్యాచ్‌లో 8 బంతులు ఎదుర్కొన్న రాహుల్ కేవలం 4 పరుగులు మాత్రమే చేసి పెవిలియన్ చేరిన విషయం తెలిసిందే.
అతడికి రెస్ట్!
ఇక బుధవారం జట్టుకు విశ్రాంతి దినం కావడంతో ఇక టీమిండియా నేరుగా మ్యాచ్ కోసమే మైదానంలోకి దిగనుంది. ఇదిలా ఉంటే.. పాకిస్తాన్‌తో మ్యాచ్‌లో అదరగొట్టిన ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యాకు నెదర్లాండ్స్‌తో మ్యాచ్ నేపథ్యంలో రెస్ట్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. అతడి స్థానంలో దీపక్ హుడాను జట్టులోకి తీసుకునే అవకాశం ఉంది.
చదవండి: T20 WC 2022: టీమిండియా సెమీస్‌కు చేరడం నల్లేరుపై నడకే..!
Ind Vs Pak: టీమిండియా మోసం చేసి గెలిచిందంటూ అక్కసు.. దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చిన దిగ్గజ అంపైర్
Hello Sydney 👋
— BCCI (@BCCI) October 25, 2022
We are here for our 2⃣nd game of the #T20WorldCup! 👏 👏#TeamIndia pic.twitter.com/96toEZzvqe
Comments
Please login to add a commentAdd a comment