వెస్టిండీస్‌తో టెస్టు సిరీస్ సొంతం చేసుకున్న టీమిండియా.. ఇప్పుడు వన్డే సిరీస్‌పై కన్నేసింది. భారత్, విండీస్ మధ్య మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా గరువారం కెన్సింగ్టన్ ఓవల్ మైదానంలో తొలి పోరు జరుగుతుంది. వరల్డ్‌కప్ సన్నాహాకాల్లో భాగంగా జరగుతున్న ఈ సిరీస్‌లో భారత జట్టు సత్తా చాటాలని భావిస్తోంది. మరోవైపు టెస్టు సిరీస్ ఓటమికి బదులు తీర్చుకోవాలని కరేబియన్ జట్టు ప్రణాళికలు సిద్దం చేస్తోంది. ఈ తొలి వన్డే సాయంత్రం 7:00 గంటలకు ప్రారంభం కానుంది.
అయితే ఈ మ్యాచ్‌కు వరుణుడు అంతరాయం కలిగించే ఛాన్స్ ఉంది. గురువారం మ్యాచ్ జరిగే సమయంలో భారీ వర్షం కురిసే అవకాశం ఉంది అని అక్కడి వాతవారణ శాఖ తెలిపింది. మ్యాచ్ జరిగే సమయంలో వర్షం రావడానికి 50 శాతం కంటే ఎక్కువ ఆస్కారం ఉంది అని వాతవారణ శాఖ ఓ ప్రకటనలో పేర్కొంది. కాగా వర్షం కారణంగా భారత్-విండీస్ రెండో టెస్టు ఆఖరి రోజు ఆట పూర్తిగా రద్దైన విషయం తెలిసిందే. దీంతో సిరీస్‌ను క్లీన్ స్వీప్ చేసే అవకాశాన్ని భారత్ కోల్పోయింది.
తుది జట్లు(అంచనా)
భారత్: రోహిత్ శర్మ(కెప్టెన్), శుబ్‌మన్ గిల్, విరాట్ కోహ్లి, సూర్యకుమార్ యాదవ్, సంజూ శాంసన్, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, శార్ధూల్ ఠాకూర్, కుల్దీప్ యాదవ్, ఉమ్రాన్ మాలిక్ , సిరాజ్
బ్రాండన్ కింగ్, కైల్ మేయర్స్, కీసీ కార్టీ, షాయ్ హోప్ (కెప్టెన్), షిమ్రాన్ హెట్మెయర్, రోవ్‌మాన్ పావెల్, రొమారియో షెపర్డ్, కెవిన్ సింక్లైర్, అల్జారీ జోసెఫ్, ఒషానే థామస్, జేడెన్ సీల్స్
చదవండి: రెచ్చిపోయిన రాబిన్ ఉతప్ప.. సరిపోని ఫ్లెచర్ మెరుపులు
Comments
Please login to add a commentAdd a comment