Steve Harmison Reckoned That Kohli May Not Give Chance To Ashwin In South Africa Test Series: దక్షిణాఫ్రికాతో త్వరలో ప్రారంభంకానున్న టెస్ట్ సిరీస్‌లో టీమిండియా తుది జట్టు కూర్పు విషయమై ఇంగ్లండ్ మాజీ పేసర్ స్టీవ్ హార్మిసన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. టీమిండియా సారధి విరాట్ కోహ్లి ఆలోచనా విధానాన్ని అంచనా వేయడం కష్టమన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేసిన హార్మిసన్.. న్యూజిలాండ్‌తో జరిగిన టెస్ట్ సిరీస్‌లో ప్లేయర్ ఆఫ్ ద సిరీస్‌గా నిలిచి సత్తా చాటిన స్టార్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్‌ను సఫారీలతో జరగబోయే టెస్ట్ సిరీస్‌లో పక్కకు పెట్టినా ఆశ్చర్యపోనక్కర్లేదని సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఫామ్ లేమితో సతమతమవుతున్న రహానే, పుజారాలను కోహ్లి తన తుది జట్టులోకి తీసుకునే సాహసం చేయగలడని పేర్కొన్నాడు.
జట్టు కూర్పు విషయంలో కెప్టెన్‌గా కోహ్లి నిర్ణయాలే కీలకమని.. అతనెప్పుడు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటాడో అర్ధం కాదని అన్నాడు. ఈ ఏడాది ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ ముగిసాక ఇంగ్లండ్‌తో జరిగిన టెస్ట్ సిరీస్‌లో అశ్విన్‌ను పక్కకు పెట్టిన విషయాన్ని హార్మిసన్ ఉదహరించాడు. తుది జట్టు కూర్పు విషయంలో సంచలన నిర్ణయాలు తీసుకోవడం కోహ్లికి కొత్తేమీ కాదని, దక్షిణాఫ్రికాతో టెస్ట్ సిరీస్‌లో ఇలాంటి ప్రయోగాలు మరిన్ని చేసే అస్కారముందని అన్నాడు. అశ్విన్ ప్రస్తుత ఫామ్‌ను పరిగణలోకి తీసుకుని సఫారీలతో సిరీస్‌లో అతనికి తుది జట్టులో అవకాశం కల్పిస్తే టీమిండియాకు లాభం చేకూరుతుందని అభిప్రాయపడ్డాడు. కాగా, కివీస్‌తో ఇటీవల ముగిసిన రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో అశ్విన్ 11.35 ఎకానమీ రేట్‌తో 14 వికెట్లు సాధించిన సంగతి తెలిసిందే.
చదవండి: Ind Vs Sa Test Seires: భారత్‌తో సిరీస్.. ప్రొటిస్ జట్టు ఇదే.. అతడు వచ్చేశాడు!
Comments
Please login to add a commentAdd a comment