
టీమిండియా పేసు గుర్రం జస్ప్రీత్ బుమ్రా బౌలింగ్ యాక్షన్ ప్రపంచవ్యాప్తంగా ఎంత పాపులరో అందరికీ తెలిసిందే. చిన్నారుల దగ్గరి నుంచి అప్‌కమింగ్ క్రికెటర్ల వరకు చాలామంది జస్సీ బౌలింగ్ శైలిని అనుకరించేందుకు ప్రయత్నిస్తుంటారు. దాయాది దేశం పాక్‌లో అయితే బుమ్రా బౌలింగ్ యాక్షన్‌కు సెపరేట్ ఫ్యాన్ బేసే ఉంది. పాక్‌లో చిన్న చిన్న పిల్లలు సైతం బుమ్రాలా బౌలింగ్ చేసేందుకు పరితపిస్తుంటారు.
A Young kid from Pakistan imitating Jasprit Bumrah action. pic.twitter.com/c7XA9xp4Dl
— Mufaddal Vohra (@mufaddal_vohra) July 15, 2024
ఓ పిల్లాడు అచ్చుగుద్దినట్లు బుమ్రాలా బౌలింగ్ చేస్తూ కనిపించిన వీడియో ఒకటి ప్రస్తుతం నెట్టింట వైరలవుతుంది. ఈ వీడియో పాతదే అయినప్పటికీ ప్రస్తుతం ట్రెండింగ్‌లో ఉంది. ఈ వీడియోలో చిన్నారి బుమ్రా బౌలింగ్ శైలిని పోలి ఉండటంతో పాటు అచ్చం బుమ్రాలాగే యార్కర్లు సంధిస్తున్నాడు. ఈ చిన్నారి పర్ఫెక్ట్‌నెస్ చూస్తే బుమ్రా సైతం ఆశ్చర్యపోక తప్పదు. ఈ చిన్నారి బౌలింగ్ శైలి, బౌలింగ్ తీరుతో పాటు రన్ అప్ కూడా బుమ్రాలాగే ఉండటం మరింత ఆశ్యర్యాన్ని కలిగిస్తుంది. ఈ వీడియోను చూసిన వారంతా పాకిస్తాన్ బుమ్రా అంటూ కామెంట్లు చేస్తున్నారు.
ఇదిలా ఉంటే, బుమ్రా ప్రస్తుతం ఆట నుంచి విరామం తీసుకుని హాలిడేలో ఉన్నాడు. భారత సెలెక్టర్లు బుమ్రాను ఇటీవల ముగిసిన జింబాబ్వే సిరీస్‌కు ఎంపిక చేయలేదు. భారత్ టీ20 వరల్డ్‌కప్ 2024 గెలవడంలో బుమ్రా కీలకపాత్ర పోషించాడు. బుమ్రా తదుపరి శ్రీలంక పరిమిత ఓవర్ల సిరీస్‌కు ఎంపికయ్యే అవకాశం ఉంది. బుమ్రా టీ20 వరల్డ్‌కప్‌లో మూడో లీడింగ్ వికెట్ టేకర్‌గా నిలిచాడు. మెగా టోర్నీలో అతను 8 మ్యాచ్‌ల్లో 15 వికెట్లు పడగొట్టాడు. భారత్.. శ్రీలంక పర్యటన జులై 27 నుంచి ప్రారంభమవుతుంది. ఈ పర్యటనలో టీమిండియా మూడు టీ20లు, మూడు వన్డేలు ఆడనుంది. జులై 27, 28, 30 తేదీల్లో టీ20లు.. ఆగస్ట్ 2, 4, 7 తేదీల్లో వన్డేలు జరుగనున్నాయి. ఈ సిరీస్‌ల కోసం భారత జట్టును ప్రకటించాల్సి ఉంది.