
మాట్లాడుతున్న మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి
శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు: నలభై ఏళ్ల రాజకీయ అనుభవం ఉందని చెప్పుకునే ప్రతిపక్షనేత చంద్రబాబు తాను సీఎంగా ఉన్నప్పుడు ప్రజలకు ఏం చేశారో ధైర్యంగా చెప్పాలని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి అన్నారు. ఆదివారం మండలంలోని ఈదగాలి గ్రామంలో నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో మంత్రి మాట్లాడారు. టీడీపీ ప్రభుత్వంలో ఎన్టీఆర్ హయాంలో అమలు చేసిన పథకాలను కొనసాగించడం తప్ప చంద్రబాబు కొత్తగా ఏం చేశారో చెప్పాలన్నారు. దివంగత నేత వైఎస్సార్ హయాంలో పేదలకు ఆరోగ్యశ్రీ, ప్రస్తుత సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అమ్మఒడి లాంటి ఎన్నో ప్రతిష్టాత్మక పథకాలు అమలు చేశారని తెలిపారు.
కానీ చంద్రబాబు హయాంలో కొత్తగా పెన్షన్ పొందాలంటే గ్రామాల్లో ఎవరైనా చనిపోతేనే కొత్తవారికి పెన్షన్ పరిస్థితి ఉండేదని గుర్తుచేశారు. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పాలన సాగిస్తున్నందునే ఒంటరిగా, ధైర్యంగా పోటీ చేస్తానని సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చెబుతున్నారని, అయితే చంద్రబాబుకు ఆ ధైర్యం ఉందా అని ప్రశ్నించారు. ఏళ్ల తరబడి పరిష్కారం కాని చుక్కల భూముల సమస్యను పరిష్కరించడంతో జిల్లాలో 23,023 రైతులకు సంబంధించి 43,270 ఎకరాలకు త్వరలో విముక్తి కలగనుందని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment