నెల్లూరు సిటీ: సస్పెక్ట్ షీటర్‌ను గుర్తుతెలియని వ్యక్తులు అత్యంత దారుణంగా హతమార్చిన ఘటన శనివారం రాత్రి చోటుచేసుకుంది. వివరాలు.. నగరంలోని ఉడ్‌హౌస్‌సంఘానికి చెందిన రాజా, వేళాంగణి దంపతుల రెండో కుమారుడు కోడూరు కల్యాణ్ అలియాస్ చిన్నా (26) పెయింటింగ్ పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నారు. నవాబుపేట పోలీస్‌స్టేషన్లో ఈయనపై సస్పెక్ట్ షీట్ నమోదైంది. ఈ క్రమంలో తన స్నేహితులతో కలిసి ఉడ్‌హౌస్‌సంఘం వెనుక రోడ్డులో మద్యాన్ని సేవించసాగారు.
ఈ తరుణంలో గుర్తుతెలియని వ్యక్తులు ఒక్కసారిగా కత్తులతో దాడికి పాల్పడ్డారు. దీంతో స్నేహితులు అక్కడి నుంచి పరారయ్యారు. టెంకాయలు నరికే కత్తితో పొడవడంతో చిన్నా అపస్మారక స్థితికి చేరుకున్నారు. స్థానికులు గమనించి హాస్పిటల్‌కు తరలించేలోపు మార్గమధ్యలో మృతి చెందారు. కాగా యేటి పండగ సందర్భంగా కొందరు యువకులతో గొడవ పడ్డారని, హత్య వెనుక వారి హస్తం ఉందని పోలీసులు అనుమానిస్తున్నారు.
రెండేళ్ల క్రితం సోదరుడి హత్య..
మృతుడి సోదరుడు సాయిపై రెండేళ్ల క్రితం వ్యక్తిగత కారణాలతో నగరంలోని వెంకటేశ్వరపురంలో కొందరు కత్తులు, రాళ్లతో దాడి చేయడంతో అక్కడికక్కడే మృతి చెందారు. ఈ క్రమంలో రెండో కుమా రుడూ హత్యకు గురవడంతో తల్లి రోదిస్తున్నారు. పోస్ట్‌మార్టం నిమిత్తం జీజీహెచ్‌కు తరలించారు. నవాబుపేట పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment