అంబేడ్కర్ విగ్రహాన్ని విస్మరించిన సీఎం
కందుకూరు రూరల్: పట్టణంలోని దూబగుంటలో మెటీరియల్ రీసైక్లింగ్ ఫెసిలిటీ సెంటర్‌ను ప్రారంభించేందుకు శనివారం వచ్చిన సీఎం చంద్రబాబు అక్కడే ఉన్న భారత రాజ్యాంగ నిర్మాణ బీఆర్ అంబేడ్కర్ విగ్రహాన్ని విస్మరించి అగౌరవపరిచారు. బస్‌లో నుంచి కాన్వాయిలోకి మారే సమీపంలో ఆ విగ్రహం ఉన్నప్పటికీ కనీసం ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించాలని అనుకోకపోవడంపై సర్వత్రా దళిత సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. అక్కడే దాదాపు అర్ధగంట సేపు సీఎంతోపాటు ప్రజాప్రతినిధులు, అధికారులు ఉన్నారు. ఆయన రాసిన రాజ్యాంగంతో పదవులు, అధికారాలు నిర్వహిస్తున్న వీరు ఆయన్ను విస్మరించడంపై విస్మయం వ్యక్తం చేస్తున్నారు.
రీ సైక్లింగ్ ఫెసిలిటీ సెంటర్ ప్రారంభం
దూబగుంట వద్ద ఏర్పాటు చేసిన మెటీరియల్ రీ సైక్లింగ్ ఫెసిలిటీ సెంటర్ (ఎంఆర్‌ఎఫ్‌సీ)ను సీఎం ప్రారంభించారు. కండి మినరల్ టెక్నాలజీ ప్రైవేట్ లిమిటెడ్ రూ.45 లక్షలతో దీన్ని ఏర్పాటు చేశారు. రోజుకు 24 టన్నుల పునర్వినియోగం లేని వ్యర్థాలను శుభ్రపరిచే యంత్రాన్ని సీఎం పరిశీలించారు. అక్కడి నుంచి దూబగుంటలో స్వచ్ఛాంధ్ర, స్వచ్ఛ దివస్ కార్యక్రమంలో దూబగుంటలోని పారిశుధ్య కార్యక్రమాలను పరిశీలించారు. భీమని హరికృష్ణ ఇంటిలో నిర్మించిన ఇంకుడుగుంతను పరిశీలించారు. ఆయన వెంట రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ, సాంఘిక సంక్షేమశాఖ మంత్రి డోలా బాల వీరాంజనేయస్వామి, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు, కలెక్టర్ ఆనంద్, ఎస్పీ కృష్ణకాంత్, సీడీఎంఏ సంపత్‌కుమార్, నెల్లూరు మున్సిపల్ కమిషనర్ సూర్యతేజ, సబ్‌కలెక్టర్ టి.శ్రీపూజ తదితరులు ఉన్నారు.
ఆగ్రహం వ్యక్తం చేస్తున్న దళిత సంఘాలు
రీసైక్లింగ్ ఫెసిలిటీ సెంటర్ ప్రారంభం
Comments
Please login to add a commentAdd a comment