చిట్టమూరు: నాన్ ఆక్వా జోన్‌లోని భూములను జోన్ పరిధిలోకి తెస్తే.. పలు రకాల రాయితీలు వర్తించే వీలుంటుందని మత్స్యశాఖ అభివృద్ధి అధికారి రఘుబాబు సూచించారు. చిట్టమూరు, మల్లాం సచివాలయాల్లో శనివారం ఆక్వా సాగుదారులతో సమావేశాలు నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ ఈ ఏడాది కొత్తగా 134 హెక్టార్లలో ఆక్వా సాగు చేసే భూములను ఆక్వా జోన్ పరిధిలోకి తీసుకునేందుకు ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. ఆక్వా సాగుదారులు సుముఖత వ్యక్తం చేస్తే సిఫారసు చేస్తామన్నారు. మండలంలోని మల్లాం, చిట్టమూరు, పాదర్తివారికండ్రిక, రంగనాథపురం, పోతువాయినపాళెం, కొక్కుపాళెం, ముక్కుటిపాళెం, రాయిపెద్దిపాళెం గ్రామాల్లో ఆక్వా సాగు చేసే భూములను జోన్ పరిధిలోకి తీసుకొస్తామన్నారు. మత్స్యశాఖ అసిస్టెంట్ వెంకటరమణ, సర్పంచ్‌లు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment