రోడ్డు ప్రమాదంలో వ్యక్తి దుర్మరణం
● మరొకరికి గాయాలు
మనుబోలు: ఆగి ఉన్న లారీని బైక్ ఢీకొన్న ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, మరొకరు గాయపడిన ఘటన మండల పరిధిలోని జాతీయ రహదారిపై కొమ్మలపూడి క్రాస్‌రోడ్డు సమీపంలో ఆదివారం చోటుచేసుకుంది. పోలీసుల వివరాల మేరకు.. కొమ్మలపూడి క్రాస్‌రోడ్డు సమీపంలోని కాఫీ డే వద్ద లారీ యాక్సిల్ విరిగిపోవడంతో రోడ్డుపై నిలిచిపోయింది. ఇదే సమయంలో ఏర్పేడు మండలం బండారుపల్లికి చెందిన మద్దిపట్ల రాజేష్ నాయుడు (34), తన స్నేహితుడు శేఖర్ కలిసి బైక్‌పై సొంతూరు వెళ్లసాగారు. ఈ క్రమంలో ఆగి ఉన్న లారీని ఢీకొన్నారు. ప్రమాదంలో బైక్ నడుపుతున్న రాజేష్ తలకు తీవ్ర గాయం కావడంతో అక్కడికక్కడే మృతి చెందగా, శేఖర్ గాయపడ్డారు. ఘటన స్థలాన్ని మనుబోలు ఎస్సై శివరాకేష్ పరిశీలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment