దేశ సంపదను దోచేయడమే లక్ష్యంగా నిర్ణయాలు
నెల్లూరు(వీఆర్సీసెంటర్): దేశ సంపద, వనరులు, ప్రభుత్వ రంగ సంస్థలను కార్పొరేట్ సంస్థలకు దోచిపెట్టడమే లక్ష్యంగా ప్రధాని మోదీ నిర్ణయాలు తీసుకుంటున్నారని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు ఆరోపించారు. కేంద్ర బడ్జెట్లో కేటాయింపులు – సవాళ్లు అనే అంశంపై నగరంలోని జెట్టి శేషారెడ్డి విజ్ఞాన కేంద్రంలో వామపక్షాల ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన సదస్సుకు ముఖ్యఅతిథిగా హాజరైన ఆయన మాట్లాడారు. ఈ విధానాలను వీడకపోతే వికసిత్ భారత్ కాస్త చీకటి భారత్‌గా మారే ప్రమాదం ఉందని ఆరోపించారు. ఉపాధి హామీ పథకం, విద్య, వైద్యం, ఆహార సబ్సిడీ, వ్యవసాయం తదితరాలకు బడ్జెట్లో కోత విధించారని విమర్శించారు. సీపీఎం జిల్లా కార్యదర్శి మూలం రమేష్, సీపీఐ జిల్లా కార్యదర్శి దామా అంకయ్య, నేతలు కత్తి శ్రీనివాసులు, రాంబాబు, నరసింహులు, మాలకొండయ్య, మాదాల వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment