
బీపీసీఎల్‌తో పర్యావరణానికి ప్రమాదం
● భూములివ్వమని
చేవూరు గ్రామ ప్రజల ఉద్ఘాటన
కందుకూరు: పర్యావరణానికి తీవ్ర నష్టం చేకూర్చే బీపీసీఎల్ పరిశ్రమకు తాము భూములివ్వమని గుడ్లూరు మండలంలోని చేవూరు గ్రామానికి చెందిన రైతులు స్పష్టం చేశారు. సోమవారం కలెక్టరేట్‌లో జరిగిన ప్రజా ఫిర్యాదుల కార్యక్రమంలో అధికారులకు వినతి పత్రం అందజేశారు. గతంలో ఇండో సోలార్ కంపెనీ పేరుతో తమ గ్రామ పరిధిలో భూములు సేకరించారని, ప్రస్తుతం ఆ భూములను బీపీసీఎల్ కంపెనీకి కేటాయించే ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. గ్రామానికి చుట్టు పక్కల ఉన్న దాదాపు 1300 ఎకరాల భూములను ఇండో సోలార్ కంపెనీ కోసం సేకరించారని, ఆ సమయంలో అధికారులు ఐదు వేల ఎకరాల కావాలని చెప్పారన్నారు. సోలార్ కంపెనీ వస్తే భూముల విలువ పెరుగుతుందని చెప్పారు. దీంతో రైతులు అందరూ కంపెనీ వస్తే భూములు విలువ పెరగడంతో పాటు, ఉపాధి అవకాశాలు మెరుగవుతాయనే, ప్రాజెక్టు వల్ల ఎటువంటి పర్యావరణ సమస్యలు రావనే ఉద్దేశంతో స్వచ్ఛందంగా భూములివ్వడానికి ముందుకు వచ్చారన్నారు.
తాగు, సాగునీటికి ఇబ్బందులు
సోలార్ కంపెనీకి కేటాయించిన భూములను బీపీసీఎల్‌కు కేటాయించే పనుల్లో అధికారులు ఉన్నారని, బీపీసీఎల్ వల్ల భూగర్భ జలాలు కలుషితమై తాగునీటికి, సాగునీటికి ఇబ్బందుల వస్తాయన్నారు. ఊళ్లకు ఊళ్లే ఖాళీ చేసే పరిస్థితులు వస్తాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రధానంగా పొలాలు కోల్పోయిన రైతులు, కూలీలు ఉపాధి కోల్పోయి రోడ్డున పడాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. కావున బీపీసీఎల్ ప్రాజెక్ట్‌కు భూములు కేటాయించొద్దని విన్నవించారు. కార్యక్రమంలో గ్రామ రైతులు నక్కా శరత్‌యాదవ్, సాయిశంకర్, ఎన్ విష్ణు, ఆర్ రామకృష్ణ, డి సురేష్, కె సునీల్, ఎన్‌రాము, పర్రే సుబ్బారాయుడు, నకాక హరినాథ్, యు సుబ్బారావు, వీ శ్రీను, ఆర్ పాపారావు, ఆర్ చెంచురామారావు, ఎన్ రమేష్, ఎన్ ఏసురత్నం, సీహెచ్ మోహన్, పి అనిల్, పి రవి, ఎల్ హరిబాబు, జి పేతురు, వై శ్రీను, వైఎస్సార్‌సీపీ జిల్లా అధికార ప్రతినిధి ముప్పవరపు కిశోర్, జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీ పాశం కొండయ్య తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment