
ఇళ్ల ముందు కంచైపె విచారణకు ఆదేశం
ఆత్మకూరు: ఆత్మకూరు మున్సిపల్ పరిధిలోని 2వ వార్డు వెంకట్రావుపల్లి తూర్పువీధిలో రాజకీయ కక్షలతో వైఎస్సార్‌సీపీకి చెందిన వారి ఇళ్లకు వెళ్లే దారిలో టీడీపీ వర్గీయులు కంచె వేసిన విషయంపై సాక్షిలో సోమవారం కథనం ప్రచురితమైన విషయం తెలిసిందే. దీనిపై ఆత్మకూరు ఆర్డీఓ బి పావని స్పందించారు. క్షేత్ర స్థాయిలో పరిశీలించి విచారణ చేయాలని డిప్యూటీ తహసీల్దారు స్వరూప్‌ను, మున్సిపల్ సిబ్బందిని ఆదేశించారు. గ్రామాల్లో ప్రజలు ప్రశాంతంగా జీవించాలని, కక్షలు పెంచుకోరాదని ఆమె సూచించారు.
ఐటీడీఏ పీఓ
బాధ్యతల స్వీకరణ
నెల్లూరు (స్టోన్‌హౌస్‌పేట): జిల్లా ఐటీడీఏ ప్రాజెక్ట్ పీఓగా బి.మల్లికార్జున్‌రెడ్డి సోమవారం బాధ్యతలు చేపట్టారు. దర్గామిట్టలోని ఐటీడీఏ కార్యాలయంలో ఆయనను ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్ పరిమళ, ఏపీఓ రమణయ్య, సిబ్బంది పుష్పగుచ్ఛాలను అందజేసి స్వాగతం పలికారు.
పెట్రోలు బంకుల్లో తనిఖీలు
నెల్లూరు (పొగతోట), నెల్లూరు(క్రైమ్): జిల్లాలో విజిలెన్స్, లీగల్ మెట్రాలజీ, పౌరసరఫరాల శాఖాధికారులు సంయుక్తంగా పెట్రోలు బంకుల్లో సోమవారం తనిఖీలు నిర్వహించారు. రికార్డుల నిర్వహణ సక్రమంగా లేకపోవడంతో బుచ్చిరెడ్డిపాళెం, ముత్తుకూరు పెట్రోలు బంకులపై 6ఏ కేసులు నమోదు చేశారు. కందుకూరులోని ఎస్‌వీఎస్ ఫిల్లింగ్ స్టేషన్‌లో 5లీటర్లకు 40 ఎంఎల్ తేడా ఉండడంతో కేసు నమోదు చేశారు. బుచ్చిరెడ్డిపాళెంలో 2, ముత్తుకూరులో 1 పెట్రోలు బంకుల్లో రికార్డు నిర్వహణలో తేడాలు ఉన్నాయి. మొత్తం పెట్రోలు, డీజిల్ కలిపి రూ.32,77,664 విలువ చేసే పెట్రోలు, డీజిల్‌ను అధికారులు సీజ్ చేశారు. ఈ తనిఖీల్లో విజిలెన్స్ అధికారులు నర్సింహారావు, శ్రీహరిరావు, సుభానీ, వేణుగోపాల్‌రావు, డీఎస్‌ఓ అంకయ్య, లీగల్ మెట్రాలజీ అధికారులు కరిముల్లా, రియాజ్ అహ్మద్ పాల్గొన్నారు.
భూములు
ఇవ్వాలంటే కష్టమే
ఉలవపాడు: బీపీసీఎల్ కంపెనీకి భూములు ఇవ్వడం తమకు ఇష్టం లేదని గ్రామస్తులు తమ అభిప్రాయాన్ని వెలిబుచ్చారు. రాష్ట్ర చేనేత జనసమాఖ్య మానవ హక్కుల వేదిక సంస్థలు సోమవారం మండల పరిధిలోని రామాయపట్నం, చాకిచర్ల, పెదపట్టపుపాళెం గ్రామాల్లో ప్రజల నుంచి అభిప్రాయ సేకరణ చేపట్టాయి. బీపీసీఎల్ కోసం 6000 ఎకరాలు తీసుకుంటున్నారన్న కథనాలు రావడంతో అభిప్రాయ సేకరణ చేస్తున్నట్లు సంస్థ సభ్యులు తెలిపారు. ప్రజల నుంచి భూసేకరణకు వ్యతిరేకత ఉందన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర చేనేత జనసమాఖ్య నాయకులు మాచర్ల మోహనరావు, రాజేష్, కృష్ణ, మానవ హక్కుల నాయకుడు రోహిత్ పాల్గొన్నారు.

ఇళ్ల ముందు కంచైపె విచారణకు ఆదేశం

ఇళ్ల ముందు కంచైపె విచారణకు ఆదేశం

ఇళ్ల ముందు కంచైపె విచారణకు ఆదేశం
Comments
Please login to add a commentAdd a comment