అరుంధతీయుల భూములు ఆక్రమించారు
● కలెక్టర్‌కు ఫిర్యాదు చేసిన
ఆనం విజయకుమార్‌రెడ్డి
నెల్లూరు(అర్బన్): రూరల్ మండల పరిధిలోని ఆమంచర్ల గ్రామంలో అరుంధతీయుల ఇళ్ల స్థలాలను ఆక్రమించడం తగదని నెల్లూరు రూరల్ నియోజకవర్గ సమన్వయకర్త ఆనం విజయకుమార్‌రెడ్డి పేర్కొన్నారు. స్థలాలు ఆక్రమించిన అధికార పార్టీ నాయకులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ బాధితులతో కలిసి సోమవారం కలెక్టరేట్‌లో కలెక్టర్ ఆనంద్‌కు వినతి పత్రం ఇచ్చారు. ఈ సందర్భంగా విజయకుమార్‌రెడ్డి మాట్లాడుతూ గతంలో రెవెన్యూ అధికారులు అర్హులైన 23 మందికి ఒక్కొక్కరికి 9 అంకణాల చొప్పున నివేశన స్థలాలు పట్టాలుగా ఇచ్చారన్నారు. కూటమి ప్రభుత్వానికి చెందిన స్థానిక నేతలు వేణుగోపాల్‌నాయుడు, వాకా వెంకటేశ్వర్లు పేదలకు ఇచ్చిన లేఅవుట్‌ను దున్నేసి, హద్దురాళ్లు పీకేసి చుట్టూ ఫెన్సింగ్ వేసుకుని ఆక్రమించారని పేర్కొన్నారు. నిరుపేద దళితులకు ఇచ్చిన స్థలాలను ఆక్రమించడం సిగ్గుచేటన్నారు. కలెక్టర్ విచారణ జరిపి న్యాయం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ జిల్లా ఉపాధ్యక్షుడు చెవిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, ఆమంచర్ల బిట్–2 ఎంపీటీసీ సురేంద్రరెడ్డి, నారాయణరెడ్డి, వైఎస్సార్‌సీపీ ట్రేడ్ యూనియన్ అధ్యక్షుడు నవీన్‌రెడ్డి, శివాజీ, సింహాద్రి, దశయ్య, రమణమ్మ, సుమతి తదితరులు పాల్గొన్నారు.
మా ప్రాంతంలో ఎండోమెంట్‌కు చెందిన 2ఎకరాల భూమి పల్లపు ప్రాంతంలో ఉంది. దీంతో అక్కడ మురుగునీరు నిలిచిపోయి దోమలు ఉధృతంగా ఉన్నాయి. దోమల ధాటికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నాం. అందువల్ల ఎండోమెంట్ స్థలాన్ని మట్టితోలించి చదును చేయించి పార్కు, ఆటస్థలంగా చేయాలి. మురుగు లేకుండా చేసి స్థానికుల ఆరోగ్యాన్ని కాపాడాలి.
– రామకృష్ణ, బాబూరావు,
వెంకటరాఘవరెడ్డి,
పరమేశ్వరినగర్ వెల్ఫేర్ అసోసియేషన్, నెల్లూరు
Comments
Please login to add a commentAdd a comment