ఓ వైపు వరుస పరీక్షలకు విద్యార్థులు సన్నద్ధమవుతుండగా మరో వైపు వచ్చేనెల 22 నుంచి ఇండియన్ ప్రైమరీ లీగ్ (ఐపీఎల్) క్రికెట్ మ్యాచ్ జరగనుంది. ఐపీఎల్ దాదాపు 40 రోజుల పాటు నిర్వహిస్తుండటంతో విద్యార్థుల తల్లిదండ్రుల్లో ఆందోళన నెలకొంది. పరీక్షల సమయంలో ఐపీఎల్ ప్రారంభం కానుండటంతో తమ పిల్లలు సెల్‌ఫోన్లు, టీవీలకు అతుక్కుపోతారేమోనన్న భయం ఉంది. వేలు, లక్షల్లో ఫీజులు చెల్లించి ఏడాది మొత్తం కష్టపడి చదివించిన పిల్లలు ఐపీఎల్ మోజులో పడతారేమోనని తల్లిదండ్రులు ఆందోళనకు గురవుతున్నారు.
పరీక్షలకు సిద్ధం చేస్తున్నాం
ప్రభుత్వ కాలేజీలో ఇంటర్ చదువుతున్న విద్యార్థులను పబ్లిక్ పరీక్షలకు సన్నద్ధం చేస్తున్నాం. పరీక్షలతో పాటు ఏపీ ఈఏపీ సెట్, జేఈఈ మెయిన్, అడ్వాన్స్‌డ్, నీట్ పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించేలా విద్యార్థులకు బోధిస్తున్నాం. ఇప్పటికే సిలబస్‌ను పూర్తి చేసి రివిజన్ చేస్తున్నాం. విద్యార్థుల సందేహాలను నివృత్తి చేసి పరీక్షల్లో మంచి ఫలితాలు సాధించేలా కృషి చేస్తున్నాం.
– మధుబాబు, డీవీఈఓ
ప్రత్యేక తరగతులు
నిర్వహిస్తున్నాం
పదో తరగతిలో సిలబస్‌ను పూర్తి చేసి రివిజన్ చేస్తున్నాం. ప్రతిరోజు ఒక సబ్జెక్టు పరీక్ష నిర్వహించి ఫలితాల్లో కొంత వెనుకబడిన విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నాం. వారి సందేహాలను నివృత్తి చేసేందుకు సబ్జెక్టు టీచర్లను పూర్తిస్థాయిలో నియమించాం. పదో తరగతి పబ్లిక్ పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించడమే లక్ష్యంగా ముందుకు వెళుతున్నాం.
– ఆర్.బాలాజీరావు, డీఈఓ
Comments
Please login to add a commentAdd a comment