వేధిస్తున్నారంటూ వివాహిత ఫిర్యాదు
నెల్లూరు(క్రైమ్): భార్యను వేధింపులకు గురిచేయడమే కాకుండా దాడి చేసిన భర్త, అతడికి సహకరిస్తున్న కుటుంబ సభ్యులపై పోలీసులు కేసు నమోదు చేశారు. వారి కథనం మేరకు.. బీవీ నగర్‌కు చెందిన అరుణకు 2017లో ప్రసాద్ అనే వ్యక్తితో వివాహమైంది. వారికి ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. ప్రసాద్ మహిళలతో సన్నిహితంగా ఉంటూ భార్యను వేధింపులకు గురిచేయసాగాడు. ఈ విషయమై పలుమార్లు బాధితురాలు పోలీసులకు ఫిర్యాదులు చేయడంతో వారు కౌన్సెలింగ్ ఇచ్చారు. అయినా అతని ప్రవర్తనలో మార్పు రాలేదు. ఇటీవల ప్రసాద్ ఓ మహిళతో ఫోన్‌లో మాట్లాడుతుండగా భార్య నిలదీసింది. దీంతో కోపోద్రిక్తుడైన అతను అరుణపై దాడి చేశాడు. ఈ విషయమై నిలదీసిన అరుణ కుటుంబ సభ్యులు, బంధువులపై సైతం ప్రసాద్ దౌర్జన్యం చేశాడు. తనను వేధింపులకు గురిచేయడమే కాకుండా దాడి చేసిన భర్త, అతడికి సహకరిస్తున్న అత్తింటివారిపై చర్యలు తీసుకోవాలని బాధితురాలు మంగళవారం వేదాయపాళెం పోలీసులకు ఫిర్యాదు చేయగా వారు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
మద్యం మత్తులో బీభత్సం
ఉదయగిరి: మండలంలోని దాసరపల్లి పీర్లచావిడి సమీపంలో సోమవారం రాత్రి కొందరు యువకులు మద్యం మత్తులో ఉన్న కారులో వెళ్తూ బీభత్సం సృష్టించారు. వేగంగా కారును నడిపుతూ సిమెంట్ బెంచీలు, మోటార్‌బైక్‌ను ఢీకొట్టగా అవి ధ్వంసమయ్యాయి. హైదరాబాద్‌కు చెందిన ఈ ముగ్గురు యువకులు వడ్లమూడిపల్లి గ్రామంలోని బంధువుల ఇంటికి వెళ్తున్న నేపథ్యంలో ఈ ఘటన చోటుచేసుకుందని చెబుతున్నారు. కాగా ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు అందలేదు.
నిమ్మ ధరలు (కిలో)
పెద్దవి : రూ.47
సన్నవి : రూ.35
పండ్లు : రూ.22
Comments
Please login to add a commentAdd a comment