ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు చర్యలు
● జాయింట్ కలెక్టర్ కార్తీక్
పొదలకూరు: జిల్లాలోని రైతు సేవా కేంద్రాల్లో 300 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకున్నామని జేసీ కార్తీక్ పేర్కొన్నారు. పొదలకూరు సచివాలయం బిట్ – 3 వద్దనున్న రైతు సేవా కేంద్రంలో మంగళవారం ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని జేసీ ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జిల్లాలో 11 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి అవుతుందని అంచనా వేస్తున్నట్టు చెప్పారు. రైతులు నిబంధనల ప్రకారం ఆరబెట్టి కొనుగోలు కేంద్రాల వద్దకు తీసుకురావాల్సిందిగా సూచించారు. పొదలకూరు సొసైటీలో ఏడు వేల గోతాలను అందుబాటులో ఉంచడం జరిగిందని, ఉచితంగా రైతులకు అందజేస్తారన్నారు. కేంద్రాల్లో పరికరాలు, సిబ్బందిని అందుబాటులో ఉంచామని చెప్పారు. జేసీ వెంట డీసీఓ గుర్రప్ప, ఏడీఏ శివనాయక్, ఏఓ వాసు, తహసీల్దార్ సురేఖ, వ్యవసాయ శాఖ సిబ్బంది ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment