ఐదువేల సీసీ కెమెరాల ఏర్పాటే లక్ష్యం
● ఎస్పీ కృష్ణకాంత్ వెల్లడి
ముత్తుకూరు: జిల్లాలో మార్చి 31వ తేదీకల్లా ఐదువేల సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని ఎస్పీ జి.కృష్ణకాంత్ వెల్లడించారు. ముత్తుకూరు పోలీస్‌స్టేషన్‌లో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలకు సంబంధించిన కంట్రోల్ రూమ్‌ను మంగళవారం సాయంత్రం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ముత్తుకూరు పోలీస్‌స్టేషన్ పరిధిలో 32 లొకేషన్లలో 55 కెమెరాలను ఏర్పాటు చేశామన్నారు. నేరాలు జరిగినప్పుడు దర్యాప్తును త్వరగా ముగించేందుకు, నేరాలకు పాల్పడిన వారిని గుర్తించేందుకు సీసీ కెమెరాలు దోహదపడతాయన్నారు. ట్రాఫిక్ జామ్ అయిన ప్రాంతాలను వెంటనే గుర్తించవచ్చన్నారు. జిల్లాలో ఇప్పటికే 2,500 కెమెరాలు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. అపార్ట్‌మెంట్లు, జనావాసాలు, వాణిజ్య సముదాయాలు అధికంగా ఉన్న ప్రాంతాల్లో నేరాలు అదుపు చేసేందుకు కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలన్నా రు. ప్రజలు సహకారం అందించాలని కోరారు. కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ సీహెచ్ సౌజన్య, రూరల్ డీఎస్పీ జి.శ్రీనివాసరావు, కృష్ణపట్నం సీఐ రవినాయక్, ముత్తుకూరు ఎస్సై విశ్వనాథరెడ్డి, కృష్ణపట్నం ఎస్సై శ్రీనివాసరెడ్డి తదిత రులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment