క్రీడాకారులను ప్రోత్సహిస్తున్నాం
● వీఎస్‌యూ వీసీ అల్లం శ్రీనివాసరావు
వెంకటాచలం: క్రీడాకారులను అన్ని విధాలా ప్రోత్సహిస్తున్నామని విక్రమ సింహపురి యూనివర్సిటీ వీసీ అల్లం శ్రీనివాసరావు తెలిపారు. ఈనెల 28వ తేదీన సేలంలో జరుగనున్న సౌత్‌జోన్ ఇంటర్ యూనివర్సిటీ హ్యాండ్‌బాల్ టోర్నమెంట్‌లో వీఎస్‌యూ పురుషుల జట్టు పాల్గొననుంది. జట్టు సభ్యులకు వీఎస్‌యూ వీసీ మంగళవారం క్రీడా దుస్తులను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రీడల్లో రాణించేందుకు క్రమశిక్షణ, కృషి చాలా ముఖ్యమన్నారు. విద్యార్థులు రాణించి వర్సిటీ ప్రతిష్టను మరింత పెంచాలని సూచించారు. కార్యక్రమంలో ఇన్‌చార్జి రిజిస్ట్రార్ డాక్టర్ కె.సునీత, స్పోర్ట్స్ బోర్డు సెక్రటరీ ఎ.రామయ్య తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment