● జేసీ కార్తీక్
నెల్లూరు రూరల్: అభ్యంతరం లేని ప్రభుత్వ భూముల్లో ఇళ్లు నిర్మించుకున్న వారు క్రమబద్ధీకరణ చేసుకోవడానికి ముందుకు రావాలని జేసీ కె.కార్తీక్ ఒక ప్రకటనలో కోరారు. 2019 అక్టోబర్ 10వ తేదీ కంటే ముందు నిరభ్యంతరకర భూముల్లో ఆర్‌సీసీ స్లాబుతో లేదా రేకులతో ఇళ్లు నిర్మించుకుని నివాసం ఉంటున్న వారు రెగ్యులరైజ్ చేసుకోడానికి ఆధారాలతో మీ–సేవ, గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా ఈ ఏడాది డిసెంబర్ 31వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలన్నారు. గుడిసెలు, తాటాకు పూరిళ్లకు ఇది వర్తించదన్నారు. 150 గజాల వరకు ఉచితంగా క్రమబద్ధీకరణ చేస్తామని, రిజిస్ట్రేషన్ ఫీజు సైతం చెల్లించాల్సిన అవసరం లేదన్నారు. 151 నుంచి 300 గజాల్లోపు అయితే బేసిక్ ధరలో 15 శాతం, రిజిస్ట్రేషన్ ఫీజులో 50 శాతం చెల్లించాలన్నారు. లేఅవుట్లు, కాలువలు, నదీ ప్రవాహ గట్లు, మాస్టర్ ప్లాన్, జోనల్ ప్లాన్‌లో నిర్దేశిత స్థలాలు, జలవనరులకు సంబంధించిన వాటిల్లో క్రమబద్ధీకరణ చేయబోరన్నారు. అర్హత కలిగిన వారి జాబితాను గ్రామ, వార్డు సచివాలయాల్లో ప్రదర్శిస్తారని, అభ్యంతరాలు స్వీకరించి తహసీల్దార్లు తుది జాబితాను సబ్ కలెక్టర్, ఆర్డీఓకు పంపిస్తారన్నారు. సబ్ డివిజనల్ లెవల్ అప్రూవల్ కమిటీ ప్రకటించిన అర్హుల జాబితాపై అభ్యంతరాలుంటే జేసీకి 30 రోజుల్లోగా అప్పీల్ చేసుకోవచ్చన్నారు. అర్హుల జాబితా ఖరారైన తర్వాత ఆ వివరాలను తహసీల్దార్లు ఆ ప్రాంత సబ్ రిజిస్ట్రార్లు, జిల్లా రిజిస్ట్రార్లకు పంపుతారని తెలియజేశారు.
Comments
Please login to add a commentAdd a comment