శివశివ శంకర.. భవహర.. కై లాసపురి దేవరా.. హరహరా.. నీలకంఠేశ్వరా.. అఖండ తేజోమయ.. లోకేశ్వరా.. రుద్రాయ భద్రాయ.. భూతనాథయ.. ఓం నమశ్శివాయ.. అంటూ శివనామస్మరణలతో శైవక్షేత్రాలు మార్మోగిపోయాయి. కై లాశాధిపతి, ఓంకారుడు, ప్రణవుడు, గరళకంఠుడు, సర్వేశ్వరుడు సకల నామరూపధారుడు పరమశివుడికి ప్రీతికరమైన మహాశివరాత్రి సందర్భంగా బుధవారం జిల్లా వ్యాప్తంగా ఆది దంపతులు కొలువైన శైవక్షేత్రాల్లో వేకువజాము నుంచే మహన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకాలు, అర్ధరాత్రి లింగోద్భవాభిషేకం, విశేష పూజలు చేశారు. క్షేత్రాల్లో దీపాలు వెలగించి ఆరాదించారు. ప్రణవుడికి ప్రణమిల్లి ప్రార్థించారు. ముక్తిప్రదాతను ముకుళిత కరాలతో ప్రణమామ్యహం అంటూ మోకరిల్లారు. ఉమామహేశ్వరుల నిలయాలు వేకువజాము నుంచి కిటకిటలాడాయి. త్రినేత్రుడిని దర్శించుకునేందుకు బారులు తీరారు. ముక్కంటి విశేషాలంకారంలో భక్తులకు నేత్రపర్వంగా దర్శనమిచ్చారు. సముద్రంలో పుణ్యస్నానాలు ఆచరించారు. భక్త వల్లభుడు ముక్కంటేశ్వరుడి ఆలయాల్లో కోలాహలం నెలకొంది. – సాక్షి, నెట్‌వర్క్
కై వల్య నాథుడికి విశేష కై ంకర్యాలు
ముకుళిత కరాలతో
ముక్తిప్రదాతకు ప్రణమామ్యహం
భక్తిశ్రద్ధలతో మహాశివరాత్రి
కిటకిటలాడిన కై లాసనాథుడి కొలువులు
Comments
Please login to add a commentAdd a comment