
గుర్తుతెలియని వ్యక్తి మృతి
నెల్లూరు(క్రైమ్): నెల్లూరు జీజీహెచ్‌లో చికిత్స పొందుతూ శనివారం గుర్తుతెలియని వ్యక్తి మృతిచెందాడు. పోలీసుల కథనం మేరకు.. సుమారు 40 ఏళ్ల వయసున్న గుర్తుతెలియని వ్యక్తి ఈనెల 13వ తేదీ సాయంత్రం పప్పులవీధి పార్కు వద్ద అపస్మారకస్థితిలో ఉండగా స్థానికులు 108కు సమాచారం అందించారు. అంబులెన్స్ సిబ్బంది అతడిని చికిత్స నిమిత్తం జీజీహెచ్‌లో చేర్పించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతిచెందాడు. వీఆర్వో నాగేశ్వరమ్మ ఫిర్యాదు మేరకు నవాబుపేట పోలీసులు కేసు నమోదు చేశారు. మృతుడి వివరాలు తెలిసిన వారు 94407 96306 ఫోన్ నంబర్‌కు సమాచారం అందించాలని ఇన్‌స్పెక్టర్ అన్వర్‌బాషా కోరారు.
యువతి అదృశ్యం
నెల్లూరు(క్రైమ్): యువతి అదృశ్యమైన ఘటనపై నెల్లూరు దర్గామిట్ట పోలీసులు శనివారం కేసు నమోదు చేశారు. వారి కథనం మేరకు.. మాగుంట లేఅవుట్‌కు చెందిన ఓ యువతి ఫ్యాషన్ డిజైనింగ్ పూర్తి చేసి ఇంట్లో ఉంటోంది. ఈనెల 14వ తేదీన ఆమె ఇంటి నుంచి అదృశ్యమైంది. బాధిత కుటుంబసభ్యులు గాలించారు. జాడ తెలియకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు దర్యాప్తు చేస్తున్నారు.
పూరిల్లు దగ్ధం
నెల్లూరు(వీఆర్సీసెంటర్): నగరంలోని 53వ డివిజ న్ గాంధీ గిరిజన కాలనీలో శనివారం పూరిల్లు దగ్ధమైంది. వివరాలు.. గాంధీ గిరిజన కాలనీలోని పూరింట్లో కట్టా నాగయ్య కుటుంబం నివాసం ఉంటోంది. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా ఇంటికి నిప్పంటుకుని దగ్ధమైంది. ఈ ప్రమాదంలో వస్తువులు కాలిపోయాయి. ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటల్ని ఆర్పివేశారు.
Comments
Please login to add a commentAdd a comment