
రైలు ఢీకొని గుర్తుతెలియని వ్యక్తి మృతి
నెల్లూరు(క్రైమ్): పట్టాలు దాటుతుండగానో? లేక బహిర్భూమికెళ్లినప్పుడు ప్రమాదవశాత్తు జరిగిందో.. స్పష్టమైన కారణం తెలియదు గానీ రైలు ఢీకొని గుర్తుతెలియని వ్యక్తి మృతిచెందాడు. ఈ ఘటన ఆదివారం తెల్లవారుజామున నెల్లూరు వేదాయపాళెం రైల్వేస్టేషన్ సమీప నెల్లూరు వైపు వచ్చే పట్టాలపై చోటుచేసుకుంది. మృతుడి వయసు 40 నుంచి 45 ఏళ్లలోపు ఉండొచ్చని భావిస్తున్నారు. మృతదేహం గుర్తుపట్టలేని విధంగా తయారైంది. నెల్లూరు రైల్వే ఎస్సై జి.మాలకొండయ్య ప్రమాద స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాన్ని జీజీహెచ్ మార్చురీకి తరలించి కేసు నమోదు చేశారు.
రోడ్డు దాటుతుండగా..
● కారు ఢీకొని మహిళ మృతి
బుచ్చిరెడ్డిపాళెం: ఓ మహిళ రోడ్డు దాటుతుండగా కారు వేగంగా ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతిచెందిన ఘటన ఆదివారం బుచ్చిరెడ్డిపాళెం నగర పంచాయతీలో జరిగింది. స్థానికులు, పోలీసుల కథనం మేరకు.. సంగం మండలం జెండాదిబ్బకు చెందిన షేక్ రహమత్ (55) బుచ్చిరెడ్డిపాళెం నగర పంచాయతీ పరిధిలోని ముంబై జాతీయ రహదారిపై ఉన్న వే బ్రిడ్జి వద్ద రోడ్డు దాటుతోంది. నెల్లూరు వైపు అతివేగంగా వస్తున్న కారు ఆమెను ఢీకొట్టడంతో మృతిచెందింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి వివరాలు సేకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు.
ఆగని చికెన్ వ్యర్థాల
అక్రమ రవాణా
● తాజాగా పడుగుపాడు వద్ద
పట్టుకున్న పోలీసులు
కోవూరు: కొందరు వ్యక్తులు చికెన్ వ్యర్థాల అక్రమ రవాణాను యథేచ్ఛగా కొనసాగిస్తున్నారు. ఆదివారం తెల్లవారుజామున చైన్నె నుంచి జాతీయ రహదారి మీదుగా మినీ వ్యాన్‌లో వ్యర్థాలు వెళ్తున్న విషయాన్ని ఎఫ్‌డీఓ శ్రీనివాసులు కోవూరు పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే పోలీసులు పడుగుపాడు వద్ద వాహనాన్ని ఆపి పరిశీలించగా అందులో 17 చికెన్ వేస్ట్ డ్రమ్ములున్నాయి. వెంటనే డ్రైవర్ ఈగ నాగరాజు, క్లీనర్ దాసరి గణేష్‌పై కేసు నమోదు చేసి వాహనాన్ని సీజ్ చేశారు. అనంతరం వ్యర్థాలను సమీపంలోని పెన్నానదిలో పూడ్చిపెట్టారు. ఈ సందర్భంగా శ్రీనివాసులు మాట్లాడుతూ కోవూరు నియోజకవర్గంలో ఎక్కడైనా చికెన్ వ్యర్థాలను రవాణా చేస్తుంటే తమ దృష్టికి తీసుకురావాలని కోరారు.

రైలు ఢీకొని గుర్తుతెలియని వ్యక్తి మృతి
Comments
Please login to add a commentAdd a comment