
నిరుద్యోగ భృతి ఇవ్వాలంటూ ధర్నా
నెల్లూరు రూరల్: యువతకు ఉద్యోగాలు కల్పించాలని, లేకపోతే నిరుద్యోగ భృతినైనా ఇవ్వాలని ఏఐవైఎఫ్ నేతలు డిమాండ్ చేశారు. ఈ మేరకు కలెక్టరేట్ ఎదుట సోమవారం చేపట్టిన ధర్నాలో వారు మాట్లాడారు. నిరుద్యోగ భృతికి బడ్జెట్లో నిధులు కేటాయించకపోవడం దారుణమన్నారు. ఎన్నికల సమయంలో చంద్రబాబు, పవన్ కల్యాణ్, లోకేష్ ఎన్నో హామీలిచ్చారని, అధికారంలోకి వచ్చాక వీటిని విస్మరించారని ఆరోపించారు. మెగా డీఎస్సీ కాగితాలకే పరిమితమైందని విమర్శించారు. వేలాది మంది నిరుద్యోగులు అప్పులు చేసి కోచింగ్ తీసుకుంటున్నారని, నోటిఫికేషన్ ఎప్పుడొస్తుందో తెలియని పరిస్థితి నెలకొందన్నారు. సమస్యలపై స్పందించకపోతే సీఎం ఇంటిని ముట్టడిస్తామని స్పష్టం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment