
ధాన్యం ధరలు పతనమయ్యాయి
జిల్లాలో ధాన్యం ధరలు రోజురోజుకూ పతనమవుతున్నాయని అఖిల భారత రైతు సంఘ నేతలు కోటిరెడ్డి, రాపూరు రాధాకృష్ణనాయుడు, శ్రీనివాసులురెడ్డి, షానవాజ్, నెల్లూరు రమణయ్య తెలిపారు. పుట్టికి రూ.16,500 మేరే మిలర్లు, దళారులు ఇస్తున్నారని, నెమ్ము పేరుతో 70 కిలోలను అదనంగా తీసుకుంటున్నారని వాపోయారు. జిల్లాలో ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలు నామమాత్రంగా మారాయని, వంద కేంద్రాల ద్వారా 11 వేల మెట్రిక్ టన్నుల ధాన్యాన్నే సేకరించారని చెప్పారు. గోతాల్లేక రైతులు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. బ్యాంక్ గ్యారెంటీలను మిల్లర్లు ఇవ్వడంలేదని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment