
ఎండల తీవ్రతతో జాగ్రత్తలు పాటించాలి
నెల్లూరు రూరల్: ఎండలు తీవ్రమవుతున్న తరుణంలో వివిధ రంగాల్లో పనిచేసే కార్మికుల శ్రేయస్సును దృష్టిలో ఉంచుకొని అవసరమైన చర్యలు చేపట్టాలని కలెక్టర్ ఆనంద్ ఆదేశించారు. కలెక్టరేట్లోని తిక్కన ప్రాంగణంలో ఇంజినీరింగ్ శాఖలు, డ్వామా అధికారులతో సోమవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. కూలీలు పనిచేసే ప్రదేశంలో తాగునీటి సౌకర్యాన్ని కల్పించడంతో పాటు నీటి కియోస్క్‌లను ఏర్పాటు చేయాలన్నారు. కూలీలు, నిర్మాణ కార్మికులు మధ్యాహ్న సమయంలో పనిచేయకుండా చూడాలని సూచించారు. పని ప్రదేశాల్లో తాత్కాలిక షెడ్లను ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు. వడదెబ్బకు గురైతే చికిత్స కోసం ప్రభుత్వాస్పత్రులు, ఆరోగ్య కేంద్రాల్లో ప్రత్యేక వార్డులను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. మూగజీవాలను రక్షించేందుకు పశుసంవర్థక అధికారులు కృషి చేయాలన్నారు. ఆర్‌డబ్ల్యూఎస్ ఎస్‌ఈ వెంకటరమణ, డీఆర్వో ఉదయభాస్కర్‌రావు, డ్వామా పీడీ గంగాభవాని తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment