నాకు మూడు గేదెలు ఉన్నాయి. రోజుకు 12 లీటర్లు పాలదిగుబడి వస్తోంది. ఈ ఏడాది వరిగడ్డి దిగుబడి బాగా తగ్గింది. ఎకరాకు 70 చుట్టలు దిగుబడి కావాల్సిఉండగా 25 మాత్రమే వచ్చాయి. వర్షాలు ఎక్కువ కురవడం, పైరు పెరుగుదల లేకపోవడంతో దిగుబడి బాగా తగ్గింది. మళ్లీ పచ్చిగడ్డి అందుబాటులోకి రావాలంటే కనీసం 7–8 నెలలు ఆగాలి. అప్పటి వరకు ఎండుగడ్డినే గేదెలకు మేతగా వేయాలి. ఇప్పుడే మోపు రూ.100 నుంచి రూ.120లు అమ్మకాలు చేస్తున్నారు. పాడి రైతుకు ఈసారి మరిన్ని కష్టాలు ఎదురయ్యేలా ఉన్నాయి. – చిమ్మిలి వెంకటేశ్వర్లు,
పాడి రైతు, కొత్తపల్లి గ్రామం