
అసభ్యకర పోస్టులపై చర్యలు తీసుకోవాలి
నెల్లూరు(క్రైమ్): మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఫొటోలను మార్ఫి ంగ్ చేసి కించపరిచేలా అసభ్యకర పోస్టులు పెట్టిన ఐటీడీపీ కార్యకర్తపై చర్యలు తీసుకోవాలని వైఎస్సార్‌సీపీ నెల్లూరు జిల్లా సెక్రటరీ ఆదిరెడ్డి డిమాండ్ చేశారు. ఆ పార్టీ నెల్లూరు రూరల్ నియోజకవర్గ సమన్వయకర్త ఆనం విజయకుమార్‌రెడ్డి ఆదేశాల మేరకు గురువారం ఆదిరెడ్డి, ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు చంద్రశేఖర్, నెల్లూరు రూరల్ నియోజకవర్గ బూత్ కమిటీ అధ్యక్షుడు సుబ్బారెడ్డి, మేధావి విభాగం అధ్యక్షుడు చంద్రమౌళి, పబ్లిక్ సిటీ అధ్యక్షుడు వినోద్, 30వ డివిజన్ నాయకులు అక్కి చంద్రారెడ్డి, 31వ డివిజన్ నాయకులు శేఖర్‌రెడ్డిలు వేదాయపాళెం పోలీసులకు వినతిపత్రం సమర్పించారు.