గార్లదిన్నె: ప్రమాదవశాత్తు రైలు ఢీకొని ఓ మహిళ మృతిచెందింది. పోలీసులు తెలిపిన మేరకు... గార్లదిన్నెకు చెందిన గౌరి (40) మంగళవారం వ్యక్తిగత పనిపై కల్లూరు గ్రామానికి వెళ్లింది. ఈ క్రమంలో రైలు పట్టాల పక్కన నడుచుకుంటూ వెళుతున్న సమయంలో శరవేగంగా ఓ రైలు దూసుకెళ్లింది. ఆ సమయంలో రైలు వేగం ఆమెను లాగేయడంతో రైలు బోగీ తగిలి తీవ్ర గాయాలతో పట్టాల పక్కన పడింది. అటుగా వెళుతున్న వారు గుర్తించి 108 అంబులెన్స్ ద్వారా అనంతపురంలోని సర్వజనాస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందింది. ఘటనపై ఎస్ఐ గౌస్ కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.
Comments
Please login to add a commentAdd a comment