ఆస్పత్రిలో అసభ్య ప్రవర్తన | - | Sakshi
Sakshi News home page

ఆస్పత్రిలో అసభ్య ప్రవర్తన

Published Thu, Jan 30 2025 12:17 AM | Last Updated on Thu, Jan 30 2025 12:17 AM

ఆస్పత్రిలో అసభ్య ప్రవర్తన

ఆస్పత్రిలో అసభ్య ప్రవర్తన

మడకశిర : స్థానిక ఏరియా ఆస్పత్రిలో చికిత్స పొందేందుకు వచ్చిన ఓ మహిళపై ఫిజియోథెరపిస్ట్‌ అసభ్యంగా ప్రవర్తించారు. దీంతో బాధితురాలు వైద్యురాలికి ఫిర్యాదు చేయగా, అధికారులు విచారణ చేపట్టారు. మూడు రోజుల క్రితం జరిగిన ఈ ఘటన తాజాగా సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. వివరాల్లోకి వెళితే... మూడు రోజుల క్రితం ఓ మహిళ ఏరియా ఆస్పత్రికి వచ్చింది. ఓపీలో ఉన్న డ్యూటీ డాక్టర్‌ వద్దకు వెళ్లి పరీక్షలు చేయించుకుంది. అనంతరం డాక్టర్‌ సలహా మేరకు ఫిజియోథెరపీ చేయించుకునేందుకు ఆ విభాగానికి వెళ్లింది. ఫిజియోథెరపీ ప్రారంభించిన కొద్దిసేపటికే సదరు మహిళ గట్టిగా కేకలు వేస్తూ గది నుంచి బయటకు వచ్చింది. అనంతరం ఫిజియోథెరపిస్ట్‌ తనపట్ల అసభ్యంగా ప్రవర్తించారని మెడికల్‌ ఆఫీసర్‌ శిశిరేఖకు ఫిర్యాదు చేసింది. దీంతో ఆమె ఉన్నతాధికారులకు విషయం తెలపడంతో ఘటనపై పూర్తిస్థాయిలో విచారణ జరిపి నివేదిక పంపాలని డీసీహెచ్‌ఎస్‌ ఆదేశించారు.

ఫిజియోథెరపిస్ట్‌పై మహిళ ఫిర్యాదు

మడకశిర ఏరియా ఆస్పత్రిలో ఘటన

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement