పారిశ్రామికాభివృద్ధితోనే ఆర్థిక ప్రగతి | - | Sakshi
Sakshi News home page

పారిశ్రామికాభివృద్ధితోనే ఆర్థిక ప్రగతి

Published Thu, Jan 30 2025 12:17 AM | Last Updated on Thu, Jan 30 2025 12:17 AM

పారిశ

పారిశ్రామికాభివృద్ధితోనే ఆర్థిక ప్రగతి

ప్రశాంతి నిలయం: పారిశ్రామిక అభివృద్ధితోనే ఆర్థిక ప్రగతి సాధ్యమని, ఇందుకోసం జిల్లాలో పరిశ్రమల స్థాపనకు తగు చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ టీఎస్‌ చేతన్‌ పేర్కొన్నారు. బుధవారం ఉదయం ఆయన కలెక్టరేట్‌లోని మినీ కాన్ఫరెన్స్‌ హాలులో జిల్లా పరిశ్రమలు, ఎగుమతుల ప్రోత్సాహక కమిటీ సమావేశం నిర్వహించారు. తొలుత జిల్లా పరిశ్రమల శాఖ పనితీరుపై కలెక్టర్‌ చేతన్‌ సమీక్షించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, జిల్లాలో పరిశ్రమల స్థాపనకు ముందుకు వచ్చే ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలకు చేయూతనివ్వాలన్నారు. ప్రభుత్వ నిబంధనల మేరకు నూతన పారిశ్రామిక విధానాన్ని అమలు చేయాలన్నారు. పరిశ్రమల ఏర్పాటుకు సిద్ధంగా ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, ఓసీ, మహిళ వర్గాలకు ప్రభుత్వ మార్గదర్శకాలపై అవగాహన కల్పించి ఉత్పత్తి, సేవారంగంలో పరిశ్రమల స్థాపనకు ముందుకు వచ్చేలా ప్రోత్సహించాలన్నారు. ముఖ్యంగా సూక్ష్మ, చిన్న మధ్య తరహా పరిశ్రమల స్థాపనకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న పథకాలపై అవగాహన కల్పించాలన్నారు. ప్రస్తుతం సింగల్‌ డెస్క్‌ పోర్టల్‌ ద్వారా వచ్చిన దరఖాస్తులను సకాలంలో పరిష్కరించాలని ఆదేశించారు. అలాగే జిల్లాలో పరిశ్రమల అనుమతుల కోసం వచ్చిన దరఖాస్తులు, ఆమోదం పొందిన వాటి వివరాలను ఆరా తీశారు. పరిశ్రమల స్థాపన అనుమతులు గడువు వరకు వేచి చూడకుండా సత్వరమే మంజూరు చేయాలన్నారు. పీఎంఈజీపీ పథకం కోసం వచ్చిన దరఖాస్తులను వెంటనే బ్యాంకులకు పంపాలన్నారు. అనంతరం పెట్టుబడి, విద్యుత్‌, వడ్డీ రాయితీ కోసం అందిన 12 క్లెయిములకు సంబంధించిన రూ. 40 లక్షలను మంజూరు చేశారు. జిల్లాలో పారిశ్రామికాభివృద్ధికి అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలన్నారు. పరిశ్రమల ఏర్పాటుకు అనుమతులు కోరుతూ సింగిల్‌ డెస్క్‌ పోర్టల్‌లో అందిన 14 దరఖాస్తులు జిల్లా కాలుష్య నియంత్రణ మండలి, ఇన్‌స్పెక్టర్‌ ఆఫ్‌ ఫ్యాక్టరీస్‌ శాఖల వద్ద పెండింగ్‌లో ఉన్నాయని, వెంటనే పరిశీలించాలని కలెక్టర్‌ ఆదేశించారు. సమావేశంలో జిల్లా పరిశ్రమల శాఖ జనరల్‌ మేనేజర్‌ నాగరాజు, ఏపీఐసీసీ జోనల్‌ మేనేజర్‌ సోనీ సహాని, ఐపీఓ సంజీవరాజు, డీపీఓ సమత, సాంఘిక సంక్షేమ శాఖ అధికారి శివరంగప్రసాద్‌, ఎల్‌డీఎం రమణ కుమార్‌, నాబార్డ్‌ ఏజీఎం అనురాధ, డిక్కీ జోనల్‌ అధ్యక్షుడు కోలా వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు.

కలెక్టర్‌ టీఎస్‌ చేతన్‌

No comments yet. Be the first to comment!
Add a comment
పారిశ్రామికాభివృద్ధితోనే ఆర్థిక ప్రగతి 1
1/1

పారిశ్రామికాభివృద్ధితోనే ఆర్థిక ప్రగతి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement