గ్రామాలకు వెళ్లండి.. పల్లె నిద్ర చేయండి
పుట్టపర్తి టౌన్: క్షేత్రస్థాయిలో శాంతిభద్రతల సమస్యలు తెలుసుకునేందుకు పోలీసులు గ్రామాలకు వెళ్లాలని, పల్లె నిద్ర చేయాలని ఎస్పీ రత్న ఆదేశించారు. బుధవారం ఆమె జిల్లా పోలీసు కార్యాలయం నుంచి డీఎస్పీలు, సీఐలు, ఎస్ఐలతో జూమ్ ద్వారా వీడీయో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా నెలవారీ నేర సమీక్ష చేశారు. నెలరోజుల్లో నమోదైన గ్రేవ్, నాన్ గ్రేవ్, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ, పోక్సో, మర్డర్, చోరీల కేసును, దర్యాప్తు తీరును అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ, పెండింగ్‌లో ఉన్న కేసులపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. కేసు నమోదైన 60 రోజుల్లోపు కోర్టులో చార్జీషీట్ దాఖలు చేసి బాధితులకు న్యాయం జరిగేలా చూడాలన్నారు. ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’ కార్యక్రమంలో అందిన అర్జీలపై విచారణ జరిపి బాధితులకు న్యాయం చేయాలన్నారు. రోజూ వాహన తనిఖీలు చేపట్టాలని, సరిహద్దు చెక్ పోస్టులను దాటే ప్రతి వాహనంపై దృష్టి సారించాలన్నారు. ప్రధాన పట్టణాల్లో ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలన్నారు. విజుబుల్ పోలీసింగ్ నిర్వహించి అసాంఘిక కార్యక్రమాలను అరికట్టాలన్నారు. రోడ్డు భద్రతా మాసోత్సవాల సందర్భంగా రోడ్డు ప్రమాదాల నివారణపై ప్రజలు అవగాహన కల్పించాలన్నారు. శాంతి భద్రతలకు భంగం కలిగించే వ్యక్తులను గుర్తించి బైండోవర్ చేయాలన్నారు. రాత్రి వేళల్లో గస్తీలు ముమ్మరం చేయడంతో పాటు పాత నేరస్తుల కదలికలపై నిఘా ఉంచాలన్నారు. వీడియో కాన్ఫరెన్స్‌లో స్పెషల్ బ్రాంచ్ సీఐ బాలసుబ్రహ్మణ్యంరెడ్డి, డీసీఆర్బీ సీఐ శ్రీనివాసులు, సైబర్ సెల్ సీఐ తిమ్మారెడ్డి, స్పెషల్ బ్రాంచ్ ఎస్ఐ ప్రదీప్ కుమార్, ఐటీ కోర్ ఇన్చార్జ్ సుదర్శన్‌రెడ్డితో పాటు సిబ్బంది పాల్గొన్నారు.
కేసుల్లో దర్యాప్తు వేగవంతం కావాలి
పోలీసులకు ఎస్పీ రత్న పిలుపు
Comments
Please login to add a commentAdd a comment