అట్టహాసంగా ‘పాలిటెక్నిక్’ స్పోర్ట్స్ మీట్ ప్రారంభం
విశాఖ స్పోర్ట్స్: కంచరపాలెం ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీలో నిర్వహిస్తున్న 27వ ఇంటర్ పాలిటెక్నిక్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ మీట్ మంగళవారం ఘనంగా ప్రారంభమైంది. రాష్ట్రంలోని 13 జిల్లాలకు చెందిన 720 మంది బాలురు, 510 మంది బాలికలు అథ్లెటిక్స్‌తో పాటు ఆరు క్రీడాంశాల్లో పోటీపడనున్నారు. వాలీబాల్, కబడ్డీ, బాల్ బ్యాడ్మింటన్, బ్యాడ్మింటన్, టీటీ, చదరంగంతో పాటు అఽథ్లెటిక్స్ ట్రాక్, ఫీల్డ్ అంశాల్లోనూ మూడు రోజుల పాటు జరిగే ఈ పోటీలో 138 ప్రభుత్వ, ప్రైవేట్ పాలిటెక్నిక్స్కు చెందిన విద్యార్థులు ప్రాంతీయ జట్లుగా తలపడనున్నారు. ఆయా జట్ల సభ్యుల నుంచి అతిథులు గౌరవవందనాన్ని స్వీకరించారు. డిఫెండింగ్ చాంప్ కృష్ణా జట్టు నుంచి ఆతిథ్య జట్టు విశాఖతో సహా 13 రీజియన్ జిల్లాలకు చెందిన క్రీడాకారులు పాల్గొన్నారు. కృష్ణా జట్టుకు జయకుమార్, అనంతపురానికి మహేష్, చిత్తూర్‌కు గిరిబాబు, తూర్పుగోదావరికి చిరంజీవి, గుంటూరుకు దేముడు, కడపకు హేమంత్‌రెడ్డి, కర్నూలుకు త్రిమూర్తి, నెల్లూరుకు తరుణి, ప్రకాశంకు నిఖిల్, శ్రీకాకుళానికి శివరామకృష్ణ, విజయనగరానికి లక్ష్మి, పశ్చిమగోదావరి జట్టుకు అవినాష్, విశాఖ జట్టుకు హేమంత్ కంటింజెంట్ లీడర్‌గా వ్యవహరించారు. క్రీడా జ్యోతి వెలిగించిన అనంతరం ఆయా జట్ల కెప్టెన్లు ప్రతిజ్ఞ చేశారు. అతిఽథులు శాంతికపోతాలను గాల్లోకి విడవగా ముఖ్యఅఽతిథి మీట్ ప్రారంభాన్ని ప్రకటించారు. గేమ్స్ బాలుర విభాగంలో అప్పర్పూల్లోని అనంతపురం రీజియన్‌తో కర్నూలు రీజియన్ జట్ల మధ్య వాలీబాల్పోటీని...అథ్లెటిక్స్ ట్రాక్ ఈవెంట్లో భాగంగా బాలబాలికలకు 800 మీటర్ల పరుగును ప్రారంభించారు. అథ్లెటిక్స్‌లో బాలబాలికలకు స్ప్రింట్ అంశాలతో పాటు 800 మీటర్ల పరుగు, జంప్స్, త్రోస్ నిర్వహించనుండగా బాలురకు 1,500 మీటర్ల పరుగు, వంద, 400 మీటర్ల రిలే పరుగును నిర్వహించనున్నారు.
క్రీడలతో ఆరోగ్యం
క్రీడాపోటీలను ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పి.రఘువర్మ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రీడలతో ఆరోగ్యం సిద్ధిస్తుందన్నారు. భారత్ శక్తి యువతేనని, సాంకేతికతను అందిపుచ్చుకుని మరింత ముందుకు సాగాలని సూచించారు. గౌరవ అతిథిగా హాజరైన సాంకేతిక విద్య సంయుక్త సంచాలకుడు వి.పద్మారావు మాట్లాడుతూ ఏటా ఒక్కో రీజియన్‌లో ఈ పోటీలు నిర్వహిస్తున్నామన్నారు. గతేడాది అనంతపురంలో నిర్వహిస్తే ఈసారి విశాఖలో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. పోటీల్లో విజేతలు దక్షిణ భారతంలోని అంతర రాష్ట్ర పాలిటెక్నిక్ ఆటల పోటీలకు అర్హత సాధిస్తారన్నారు. విశాఖ ప్రభుత్వ పాలిటెక్నిక్ ప్రిన్సిపాల్ నారాయణరావు, కాకినాడ, తిరుపతి ప్రాంతాయ సంయుక్త సంచాలకులు సత్యనారాయణ, నిర్మల కుమార్ ప్రియ, సాంకేతిక విద్య, శిక్షణ మండలి కార్యదర్శి జీవీ రామచంద్రరావు, డిప్యూటీ డైరెక్టర్ విజయ భాస్కర్, సాంకేతిక విద్యాశాఖ ట్రైనింగ్ అండ్ ప్లేస్‌మెంటు డిప్యూటీ డైరెక్టర్ డాక్టర్ ఎంఏవీ రామకృష్ణ, స్పోర్ట్స్ మీట్ సహ సమన్వయాధికారి డాక్టర్ బి.జానకీరామ్, వివిధ కాలేజీల ప్రిన్సిపాల్స్ పాల్గొన్నారు.
13 జిల్లాల నుంచి హాజరైన పాలిటెక్నిక్ విద్యార్థులు
అథ్లెటిక్స్‌తో పాటు ఆరు క్రీడాంశాల్లో పోటీ
Comments
Please login to add a commentAdd a comment