మాతాశిశు మరణాలు అరికట్టాలి | - | Sakshi
Sakshi News home page

మాతాశిశు మరణాలు అరికట్టాలి

Published Wed, Jan 29 2025 12:56 AM | Last Updated on Wed, Jan 29 2025 12:56 AM

మాతాశిశు మరణాలు అరికట్టాలి

మాతాశిశు మరణాలు అరికట్టాలి

ప్రశాంతి నిలయం: మాతాశిశు మరణాలను పూర్తిగా అరికట్టాలని, ఇందుకు వైద్య, ఆరోగ్య, ఐసీడీఎస్‌ శాఖలు సమష్టిగా పనిచేయాలని కలెక్టర్‌ టీఎస్‌ చేతన్‌ అన్నారు. మంగళవారం కలెక్టరేట్‌లోని పీజీఆర్‌ఎస్‌ సమావేశ మందిరంలో మాతాశిశు మరణాలపై ఆయన సమీక్షించారు. గత ఏడాది అక్టోబర్‌ నుంచి డిసెంబర్‌ వరకు జరిగిన మతాశిశు మరణాల గురించి చర్చించారు. అనంతరం కలెక్టర్‌ మాట్లాడుతూ, మహిళ గర్భం దాల్చినప్పటి నుంచి ప్రసవం అయ్యే వరకూ ప్రతి ఆశ, ఆరోగ్య కార్యకర్త, హెల్త్‌ సూపర్‌వైజర్‌ నిరంతరం వారికి అందుబాటులో ఉంటూ ఎప్పటికప్పుడు ఆరోగ్య వివరాలు సేకరించాలన్నారు. అలాగే ఐసీడీఎస్‌ సిబ్బంది పౌష్టికాహారం అందిస్తూ రక్తహీనత లేకుండా చూసుకోవాలన్నారు. అలాగే ప్రతి ఆశ డే మీటింగ్‌లోనూ గర్భవతులకు ‘బర్త్‌ప్లాన్‌’ గురించి, ప్రధాన మంత్రి సురక్షిత మాతృత్వ అభియాన్‌ గురించి వివరించాలన్నారు. ఏ తల్లీ జన్మనిస్తూ మరణించకూడదు, ఏ బిడ్డా జన్మిస్తూ మరణించకూడదన్న లక్ష్యంతో పని చేయాలన్నారు. గడిచిన త్రైమాసికంలో మాతృమరణాలు 4, శిశు మరణాలు 17 సంభవించాయని, వీటిపై ప్రత్యేకంగా చర్చించి కారణాలు వెలికితీయాలని సూచించారు. తిరిగి ఇలాంటి మరణాలు సంభవించకుండా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. కార్యక్రమంలో డీఎంహెచ్‌ఓ డాక్టర్‌ ఫైరోజా బేగం, డీసీహెచ్‌ఎస్‌ డాక్టర్‌ తిప్పేంద్ర నాయక్‌, డీఐఓ డాక్టర్‌ శ్రీనివాస్‌, డిప్యూటీ డీఎంహెచ్‌ఓ డాక్టర్‌ మంజువాణి, డాక్టర్‌ సెల్వియా థామస్‌, ఐసీడీఎస్‌ పీడీ వరలక్ష్మితోపాటు పలువులు వైద్యులు పాల్గొన్నారు.

కలెక్టర్‌ టీఎస్‌ చేతన్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement