క్వింటా కందికి ప్రభుత్వం నిర్ణయించిన మద్దతు ధర | - | Sakshi
Sakshi News home page

క్వింటా కందికి ప్రభుత్వం నిర్ణయించిన మద్దతు ధర

Published Wed, Jan 29 2025 12:56 AM | Last Updated on Wed, Jan 29 2025 12:56 AM

క్విం

క్వింటా కందికి ప్రభుత్వం నిర్ణయించిన మద్దతు ధర

మడకశిర: జిల్లాలో 32 మండలాలుండగా, ఖరీఫ్‌లో 30 మండలాల రైతులు కంది పంటను సాగు చేశారు. ప్రధానంగా 15 మండలాల్లో ఎక్కువ శాతం కందిని సాగు చేశారు. సరిగ్గా పంట చేతికందే సమయంలో వరుస తుపాన్లు చుట్టుముట్టాయి. ఫలితంగా దిగుబడి గణనీయంగా తగ్గింది. ఆ తర్వాత వరుణుడు కాస్త కనికరించినా...పంట కళ్లంలో చేరాక మళ్లీ విరుచుకుపడ్డాడు. ఫలితంగా కంది నాణ్యతపై తీవ్ర ప్రభావం చూపింది. రంగుమారడం, గింజలు విరగడం, తేమశాతం పెరగింది. ఈ పరిస్థితుల్లో రైతుకు సాయంగా నిలవాల్సిన సర్కార్‌..మొండి చేయి చూపుతోంది. మద్దతు ధర ప్రకటించి కొనుగోలు కేంద్రాల ద్వారా పంట కొనుగోలు చేస్తామని ప్రకటించినా...సవాలక్ష నిబంధనలు విధించింది. దీంతో రైతు పరిస్థితి అగమ్యగోచరమైంది.

3 మండలాల్లోనే

కొనుగోలు కేంద్రాల ఏర్పాటు

రాష్ట్ర ప్రభుత్వం క్వింటాల్‌ కందులకు రూ. 7,550 మేర మద్దతు ధర నిర్ణయించింది. ఈ మేరకు కొనుగోలు చేయాని మార్క్‌ఫెడ్‌ను ఆదేశించింది. దీంతో జిల్లాలోని డీసీఎంఎస్‌లు, పీఏసీఎస్‌ల ద్వారా కొనుగోలు చేయడానికి మార్క్‌ఫెడ్‌ ఏర్పాట్లు చేసింది. ఇప్పటికే జిల్లాలోని రైతులు కందులను విక్రయించడానికి ఆయా రైతు సేవా కేంద్రాల్లో పేర్లను నమోదు చేసుకున్నారు. అయితే ప్రభుత్వం ఇప్పటివరకు బత్తలపల్లి, తాడిమర్రి, ధర్మవరం మండలాల్లోనే కంది కొనుగోలు కేంద్రాలను ప్రారంభించింది. అక్కడ కూడా నేటికీ 100 క్వింటాళ్ల కందిని కూడా కొనుగోలు చేయలేదు. మిగిలిన మండలాల్లో కొనుగోలు కేంద్రాలను ఎప్పుడు ప్రారంభిస్తుందో కూడా చెప్పకపోవడంతో రైతులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

నిబంధనలతో మెలిక

కందుల కొనుగోలుపై నాణ్యతా ప్రమాణాలకు సంబంధించి ప్రభుత్వం 8 నిబంధనలను విధించింది. తేమ శాతం 12 లోపు ఉండాలని, ఇతర వ్యర్థ పదార్థాలు 2 శాతం లోపు, దెబ్బతిన్న గింజలు 3 శాతం లోపు, పాక్షికంగా దెబ్బతిన్న, రంగు మారిన గింజలు 3 శాతం లోపు ఉండాలన్న నిబంధనలు విధించింది. ఈ మేరకే కొనుగోలు కేంద్రాల్లో రైతుల నుంచి కందులు కొనుగోలు చేసేందుకు సిద్ధమైంది. అయితే గత ఏడాది నవంబర్‌, డిసెంబర్‌ మాసాల్లో వరుస తుపాన్లు, ఆ తర్వాత తుంపర వర్షాలు కురిశాయి. ఫలితంగా కందిపంట దెబ్బతింది. దీంతో కందుల్లో నాణ్యత తగ్గింది. రాష్ట్ర ప్రభుత్వం మాత్రం నాణ్యమైన కందులనే కొనుగోలు చేస్తామని చెబుతోంది. దీనిపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కొందరు రైతులు ప్రైవేట్‌ వ్యాపారులకు అమ్ముకునేందుకు సిద్ధమయ్యారు. రైతులు ప్రైవేటుకు పంట విక్రయించాక కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తే ఏమి లాభమని పలువురు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికై నా ప్రభుత్వం స్పందించి కందుల కొనుగోళ్లలో నిబంధనలు సడలించడంతో పాటు జిల్లాలోని అన్ని మండలాల్లో వెంటనే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని పలువురు రైతులు కోరుతున్నారు.

అమ్మకానికి సిద్ధంగా ఉంచిన కందులు

రూ.7,550

కంది రైతు కొనుగోల

కందుల కొనుగోళ్లపై

సవాలక్ష నిబంధనలు

తీవ్ర అడ్డంకిగా మారిన తేమశాతం

ప్రభుత్వ నిబంధనలపై రైతుల

అసంతృప్తి

3 మండలాల్లోనే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసిన ప్రభుత్వం

నాణ్యతగా ఉంటేనే కొంటాం

ప్రభుత్వం క్వింటాల్‌ కందులకు రూ.7,550 మద్దతు ధర ప్రకటించింది. అయితే కొనుగోలుకు కొన్ని నిబంధనలు విధించింది. ఈ మేరకు నాణ్యతా ప్రమాణాలు చూసే కందులను కొనుగోలు చేస్తాం. ప్రస్తుతం జిల్లాలో మూడు చోట్ల కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాం. వారంలోపు జిల్లా వ్యాప్తంగా పూర్తి స్థాయిలో కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయడానికి చర్యలు తీసుకుంటున్నాం.

–గీతమ్మ, మార్క్‌ఫెడ్‌ జిల్లా మేనేజర్‌

మద్దతు ధర పెంచాలి

ఈసారి కంది పంటను కాపాడుకునేందుకు రైతులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. పెట్టుబడులు కూడా భారీగా పెరిగాయి. అందువల్ల కందికి ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర మరింత పెంచాలి. అలాగే నిబంధనలు పక్కన పెట్టి రైతుల వద్ద కందులన్నీ కొనుగోలు చేయాలి. లేకపోతే రైతులు తీవ్రంగా నష్టపోతారు. ఇప్పటికీ జిల్లాలో మూడు కొనుగోలు కేంద్రాలు మాత్రమే ఏర్పాటు చేశారు. మిగతా ప్రాంతాల్లోనూ వెంటనే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలి.

–నాగరాజు, బీజీహళ్ళి, రొళ్ల మండలం

నిబంధనలు సరికాదు

కంది పంట చివరి దశలో ఉండగా... తుంపర వర్షాలు పడి నాణ్యత లోపించింది. అలాగే కందులు ఆరబోసినప్పుడు ఆకాల వర్షాలు కురిసి తేమ శాతం పెరిగింది. ప్రభుత్వం మాత్రం కంది కొనుగోళ్లకు పలు నిబంధనలు విధించింది. దీనివల్ల రైతులకు తీవ్ర నష్టం జరుగుతుంది. ఇప్పటికైనా పాలకులు స్పందించి నిబంధనలు పక్కన పెట్టి రైతులు పండించిన కందులన్నీ కొనుగోలు చేయాలి.

–జనార్దన్‌రెడ్డి, జీగొల్లహట్టి, రొళ్ల మండలం

No comments yet. Be the first to comment!
Add a comment
క్వింటా కందికి ప్రభుత్వం నిర్ణయించిన మద్దతు ధర1
1/4

క్వింటా కందికి ప్రభుత్వం నిర్ణయించిన మద్దతు ధర

క్వింటా కందికి ప్రభుత్వం నిర్ణయించిన మద్దతు ధర2
2/4

క్వింటా కందికి ప్రభుత్వం నిర్ణయించిన మద్దతు ధర

క్వింటా కందికి ప్రభుత్వం నిర్ణయించిన మద్దతు ధర3
3/4

క్వింటా కందికి ప్రభుత్వం నిర్ణయించిన మద్దతు ధర

క్వింటా కందికి ప్రభుత్వం నిర్ణయించిన మద్దతు ధర4
4/4

క్వింటా కందికి ప్రభుత్వం నిర్ణయించిన మద్దతు ధర

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement