పావగడ సోలార్ పార్క్లో పేలుళ్లు
పావగడ: తాలూకాలోని తిరుమణి సోలార్ పార్క్లో డిటోనేటర్ పేలి ఓ వ్యక్తి దుర్మరణం పాలయ్యాడు. తిరుమణి సోలార్ పార్క్లో సూపర్వైజర్గా బళ్లారి జిల్లా సిరిగుప్పకు చెందిన బసవరాజు (50) పనిచేస్తున్నాడు. ఇటీవల పార్క్లో నూతనంగా సబ్స్టేషన్ నిర్మాణ పనులు చేపట్టారు. ఈ క్రమంలో దాదాపు 10 ఎకరాల భూమిలో ఉండే గుట్టను పేల్చి చదును చేసే పనులు జరుగుతున్నాయి. గుట్టను పేల్చేందుకు డిటోనేటర్లను గుట్టలో ఏర్పాటు చేశారు. సోమవారం సాయంత్రం గుర్తు తెలియని వ్యక్తులు గుట్టపై ఉన్న ఎండు గడికి నిప్పు రాజేయడంతో మంటలు వ్యాపించాయి. గమనించిన కంపెనీ అధికారుల ఆదేశాలతో సూపర్వైజర్ బసవరాజు, కార్మికుడు శివయ్య మంటలు ఆర్పుతుండగా ఒక్కసారిగా ఓ డిటోనేటర్ పేలింది. సమీపంలోనే ఉన్న బసవరాజు అక్కడికక్కడే మృతి చెందాడు. తీవ్రంగా గాయపడిన శివయ్యను వెంటనే ఆస్పత్రికి తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం బెంగళూరుకు తీసుకెళ్లారు. సమాచారం అందుకున్న సీఐ గిరీష్ అక్కడకు చేరుకుని పరిశీలించారు. విషయం తెలుసుకున్న ఎస్పీ అశోక్ ఆదేశాలతో మంగళవారం ఉదయం బాంబ్ స్క్వాడ్ బృందం అక్కడకు చేరుకుని పరిశీలించింది. ఓ ట్రాక్టర్ లో ఉన్న 40 డిటోనేటర్లను గుర్తించి నిర్వీర్యం చేశారు. ఎలాంటి సురక్షిత ప్రమాణాలు పాటించకుండా డిటోనేటర్లతో అక్రమంగా గుట్టను పేల్చడానికి పూనుకున్న జేఎస్డబ్ల్యూ కంపెనీ మేనేజర్ అమర్రాజ్, కాంట్రాక్టర్, డిటోనేటర్లు పేల్చే ఇద్దరిపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
సూపర్ వైజర్ మృతి
మరో కార్మికుడికి తీవ్ర గాయాలు
Comments
Please login to add a commentAdd a comment