
వేతనజీవుల ఊసులేని రాష్ట్ర బడ్జెట్
శ్రీకాకుళం (పీఎన్‌కాలనీ): రాష్ట్ర బడ్జెట్ సందర్భంగా వేతనాలు పెరుగుతాయని ఎదురుచూసిన వేతన జీవుల ఆశలను రాష్ట్ర ప్రభుత్వం అడియాసలు చేసిందని సీఐటీయూ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు సీహెచ్.అమ్మన్నాయుడు, పి.తేజేశ్వరరావు అన్నారు. జిల్లా కేంద్రంలోని సీఐటీయూ కార్యాలయంలో శనివారం వారు విలేకరులతో మాట్లాడుతూ ఆప్కాస్ రద్దు చేసి తిరిగి పాత కాంట్రాక్టు పద్ధతి పునరుద్ధరించడం వల్ల ఉద్యోగులు, కార్మికుల్ని అభద్రతాభావానికి గురవుతున్నారని చెప్పారు. గత ఏడాది ఆందోళన చేసిన అంగన్‌వాడీ, ఆశా, వెలుగు వీఓఏ, మధ్యాహ్న భోజన పథకం, సర్వ శిక్షా అభియాన్ ఉద్యోగులు, మున్సిపల్ వర్కర్లకు న్యాయం చేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం తాజా బడ్జెట్లో జీతాల పెంపుపై ఎటువంటి ప్రస్తావన చేయకపోవడం దారుణమన్నారు.
Comments
Please login to add a commentAdd a comment