
ఈ అబ్బాయి పేరు మురళీ కృష్ణ..
14 ఏళ్ల ఈ బాలుడి స్వస్థలం చిలకపాలెం. కుప్పిలి మోడల్ స్కూల్‌లో చదువుకునేవాడు. గత ఏడాది మే 4న పొందూరు వైపు వెళుతున్న భారీ వాహనం ఈడ్చుకెళ్లడంతో మొత్తం రెండు కాళ్లకు సంబంధించిన మజిల్ పూర్తిగా పోయింది. ఎముకలు మాత్రం మిగిలాయి. శ్రీకాకుళంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో రూ.13 లక్షలు ఖ ర్చు పెట్టి చికిత్స చేయించినా ఫలితం శూన్యం. విధిలేని పరిస్థితుల్లో విశాఖపట్నంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళితే కాళ్లు తీసేయాలన్నారు. తల్లిదండ్రులు చేసేది లేక కేజీహెచ్‌కు తీసుకెళ్లారు. అక్కడి వైద్యులు బాలుడి తండ్రి తొడ నుంచి మజిల్ సేకరించి కాళ్లకు అమర్చారు. నెల రోజుల తరువాత బాలుడి మ జిల్‌తో మరో శస్త్ర చికిత్స చేశారు. మా ప్రయ త్నం మేం చేశాం.. ఇంకా మీరు రోజూ ఫిజియోథెరపీ చేయించుకుంటే ఫలితం ఉంటుందని అక్కడ డాక్టర్లు చెప్పేశారు. నడవలేని స్థితిలో మురళీ కృష్ణ నా విభాగానికి వచ్చాడు. నా సిబ్బంది ఉన్న పరికరాలతోనే రోజువారీ వ్యాయామాలను చేయిస్తూ తొమ్మిది నెలలుగా ఫిజియో చేయించుకుంటున్నాడు. చక్కగా నడుస్తూ సాధారణ జీవితంలోకి మెల్లమెల్లగా వస్తున్నాడు. నా విభాగంపై దృష్టి సారించే బడ్జెట్ కేటాయిస్తే అధునాతన పరికరాలు ఏర్పాటు చేస్తే రోగులు మరింత త్వరగా కోలుకునే అవకాశం ఉంది.
Comments
Please login to add a commentAdd a comment