నేషనల్ కోచింగ్ శిబిరానికి ఇద్దరు ఎంపిక
శ్రీకాకుళం న్యూకాలనీ: జాతీయ స్థాయి పోటీలకు ముందు జరిగే శిక్షణా శిబిరాలకు జిల్లా నుంచి ఇద్దరు బాస్కెట్‌బాల్ క్రీడాకారులు ఎంపికయ్యారు. ఆంధ్రప్రదేశ్ ప్రాబబుల్స్ జట్లకు ఎంపికై నవారిలో వి.ప్రవీణ్, ఎస్.ప్రేమశ్రీ ఉన్నారు. ఈ పోటీలు మార్చి 3 నుంచి చిత్తూరు వేదికగా మొదలుకానున్నాయి. అనంతరం ఈ నెల 18 నుంచి 24 వరకు అసోం రాష్ట్రం గౌహతి వేదికగా జరగనున్న ఆలిండియా అండర్–23 బాస్కెట్‌బాల్ చాంపియన్‌షిప్ పోటీల్లో ఆంధ్రా జట్లు ప్రాతినిధ్యం వహించనున్నాయి. వీటికి వీరిద్దరి ఎంపిక లాంఛనమేనని జిల్లా సంఘ ప్రతినిధులు భావిస్తున్నారు. ఆదివారం పయనమైన క్రీడాకారులను బాస్కెట్‌బాల్ అసోసియేషన్ జిల్లా చైర్మన్ ఎమ్మెస్సార్ కృష్ణమూర్తి తన నివాసంలో అభినందించారు. శిక్షణా శిబిరాలకు, జాతీయ పోటీలకు వెళ్లేందుకు అవసరమైన ఆర్థిక సాయాన్ని అందజేశారు. కార్యక్రమంలో డీఎస్‌ఏ కోచ్, కార్యదర్శి గాలి అర్జున్‌రావురెడ్డి, సీనియర్ ప్లేయర్స్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment