సీనియారిటీ జాబితాలో తప్పులు సవరించాలి
శ్రీకాకుళం న్యూకాలనీ: విద్యాశాఖ అధికారిక వెబ్‌సైట్‌లో ఉంచిన ఉపాధ్యాయ సీనియారిటీ జాబితాలో తప్పులు దొర్లాయని.. వాటిని సవరించాలని జిల్లా ఎస్టీయూ నాయకులు ఎస్వీ రమణ, జి.రమణ విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు గురువారం జిల్లా విద్యాశాఖాధికారి డాక్టర్ తిరుమల చైతన్యకు వినతిపత్రం అందజేశారు. కొంతమందివి డీఎస్సీ సంవత్సరాల్లో తప్పులున్నాయని, కొంతమంది పేర్లే లేవని, మేనేజ్‌మెంట్లలో తప్పులు, దోషాలున్నాయని పేర్కొన్నారు. అప్పీల్ చేసుకునేందుకు గడువు పెంచాలని విన్నవించారు. సానుకూలంగా స్పందించిన డీఈఓ తగు న్యాయం చేస్తామని హామీ ఇచ్చినట్టు చెప్పారు. కార్యక్రమంలో ఎస్టీయూ ప్రతినిధులు కె.శ్రీనివాసరావు, చింతల రామారావు, ఎస్.లక్ష్మణరావు, ఎం.తేజ, జి.శ్రీను, డీవీఎస్, హరి, సీహెచ్ జగన్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment