డయాలసిస్ బెడ్లు పెంచాలి
కవిటి: కిడ్నీ వ్యాధిగ్రస్తులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం డయాలసిస్ బెడ్ల సంఖ్య పెంచాలని ఇచ్ఛాపురం నియోజకవర్గ వైఎస్సార్ సీపీ నేత పిరియా సాయిరాజ్ డిమాండ్ చేశారు. శుక్రవారం కవిటిలో మండల కన్వీనర్ కడియాల ప్రకాష్ ఆధ్వర్యంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రధానంగా కవిటి మండలంతో పాటు చాలా కేంద్రాల్లో డయాలసిస్ కోసం వేచి చూసే రోగులసంఖ్య అధికంగా ఉన్న నేపథ్యంలో ప్రభుత్వం సానుకూల దృక్పథంతో డయాలసిస్ బెడ్ల సంఖ్య పెంపు దిశగా ఆలోచన చేయాలని కోరారు. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన తర్వాత పింఛన్లను రూ.10వేలకు పెంచాలని గుర్తు చేశారు. కవిటిలో పదిలోపు ఉన్న బెడ్‌ల సంఖ్యను 19కు పెంచిన విషయాన్ని తెలిపారు. ఇచ్ఛాపురంలో డయాలసిస్ సెంటర్ కూడా ఏర్పాటు చేశారని, దాన్ని ప్రారంభించాలన్నారు. సమావేశంలో వైఎస్సార్‌సీపీ నేతలు కడియాల ప్రకాష్, జల్లు యుగంధర్, పి.చంద్రశేఖర్, ఎస్‌పీ నారాయణస్వామి, భద్రాచలం, వై.నీలయ్య, కొర్రాయి గోపాల్, దుద్ది ధర్మారావు పాల్గొన్నారు.
సర్కారు సేవాలోపం
ఉద్దానం విలాపం
డయాలసిస్ బెడ్లు పెంచాలి
డయాలసిస్ బెడ్లు పెంచాలి
Comments
Please login to add a commentAdd a comment