
గంజాయి రవాణా గుట్టురట్టు
పాతపట్నం: గంజాయి తరలిస్తున్న తమిళనాడు రాష్ట్రం తిరువల్లూరు జిల్లా తిరుమల్‌లైయల్ గ్రామానికి చెందిన ధనుష్ ఏకాంబరంను శనివారం అరె స్టు చేశామని సీఐ వి.రామారావు తెలిపారు. పాతపట్నం అంతర్రాష్ట్ర సరిహద్దు చెక్‌పోస్టు వైపు పర్లాకిమిడి (ఒడిశా) నుంచి నడుకుంటూ వస్తున్న ధనుష్ వద్ద 4.596 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. ఒడిశాలోని బల్లిగుడా వెళ్లి రాజు అలియాస్ దొరవద్ద రూ.10 వేలుకు గంజాయి కొ నుగొలు చేసి వస్తున్నట్లు గుర్తించామన్నారు. సమా వేశంలో ఎస్‌ఐ బి.లావణ్య, సిబ్బంది పాల్గొన్నారు.
గంజాయి విక్రేతపై కేసు నమోదు
ఆమదాలవలస: పట్టణ రైల్వేస్టేషన్ జంక్షన్‌లో కిళ్లీ కొట్టులో గంజాయి విక్రయిస్తున్న పొట్నూరు కృష్ణారావుపై శనివారం కేసు నమోదు చేసినట్లు ఆమదాలవలస ఎస్‌ఐ ఎస్.బాలరాజు తెలిపారు. 70 గ్రాములు గంజాయిని స్వాధీనం చేసుకుని, ఆమదాలవలస జూనియర్ సివిల్ జడ్జి కోర్టుకు తరలించినట్లు చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment